సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమ్‌ను ప్రకటించిన బీసీసీఐ
x
India
Highlights

సౌత్ఆఫ్రికా తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు గాను భారత జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ.. సునీల్ జోషి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఈరోజు జట్టును ఎంపిక...

సౌత్ఆఫ్రికా తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు గాను భారత జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ.. సునీల్ జోషి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఈరోజు జట్టును ఎంపిక చేసింది. గాయాలతో ఆటకు దూరమైనా శిఖర్‌ ధావన్, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ పాండియాలకి తిరిగి జట్టులో స్థానం సంపాదించుకున్నారు. ఇక ఈ సిరీస్‌కు గాను ఓపెనర్ రోహిత్ శర్మకి సెలెక్టర్లు విశ్రాంతిని ఇచ్చారు. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మార్చి 12న తొలి వన్డే, లఖ్‌నవూ వేదికగా మార్చి 15న రెండో వన్డే, కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో మార్చి 18న ఆఖరి వన్డే ఆడనుంది. అన్ని మ్యాచ్ లు భారత కాలమాన ప్రకారం 1.30 గంటలకు మొదలవుతుంది.

జట్టు వివరాలు:

శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్, మనీష్‌ పాండే, శ్రేయస్ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, శుభ్‌మన్‌ గిల్‌


Show Full Article
Print Article
More On
Next Story
More Stories