బంగ్లాదేశ్ టార్గెట్ 149 పరుగులు..

bangladesh vs india
x
bangladesh vs india
Highlights

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో భారత జట్టు నిర్ణిత 20 ఓవర్ లో ఆరు వికెట్లను కోల్పోయి 148 పరుగులు చేయగలిగింది. మొదటగా టాస్ ఒడి...

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్ లో భారత జట్టు నిర్ణిత 20 ఓవర్ లో ఆరు వికెట్లను కోల్పోయి 148 పరుగులు చేయగలిగింది. మొదటగా టాస్ ఒడి బ్యాటింగ్ కి దిగిన భారత్ కి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్ లో రెండు ఫోర్లు కొట్టి మంచి దూకుడుగా కనిపించిన రోహిత్ శర్మ(9) వెంటనే అవుట్ అయ్యాడు.ఆ తర్వాత కేఎల్ రాహుల్(15) కూడా వెంటనే అవుట్ అవడంతో భారత్ 36 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

అయితే ఇలాంటి టైంలో శ్రేయాస్ అయ్యర్ (22),శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే పనిలో ఉన్నారు. ఇక సర్దుకుంది అన్న సమయంలో శ్రేయాస్ అవుట్ అయ్యాడు, కాసేపటికి ధావన్ రన్ అవుట్ అయ్యాడు. ఇక చివరలో మిగిలిన బ్యాట్స్ మెన్స్ రాణించగా భారత్ 148 పరుగులు చేయగలిగింది.. ఇప్పుడు బంగ్లాదేశ్ విజయం లక్ష్యం 149 పరుగులుగా ఉంది. బంగ్లా బౌలర్లలో షఫీయుల్ ఇస్తాం (2/36), అమినుల్ ఇస్లాం (2/22) చెరో రెండు, అఫిఫ్‌ హుస్సేన్‌ (1/11) వికెట్‌ పడగొట్టాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories