పరుగులు పిండుతున్నారు.. కానీ వికెట్లే..

పరుగులు పిండుతున్నారు.. కానీ వికెట్లే..
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్ విసిరిన 322 పరుగుల సవాల్ ని స్వీకరించిన బంగ్లాదేశ్ ధీటుగా జవాబిస్తుంది.కానీ ఇరవై ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు...

వరల్డ్ కప్ టోర్నీలో వెస్టిండీస్ విసిరిన 322 పరుగుల సవాల్ ని స్వీకరించిన బంగ్లాదేశ్ ధీటుగా జవాబిస్తుంది.కానీ ఇరవై ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 52 వద్ద సౌమ్య సర్కార్ ఔటయినా తరువాత క్రీజులోకి వచ్చిన హాసన్ తో కలిసి ఇక్బల్ స్కోరు బోర్డును పరుగులెతించాడు. ఇద్దరూ బాంగ్లాదేశ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుంటూ పరుగులు పిండుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఇక్బల్ తన వ్యక్తిగత స్కోరు 48 పరుగుల వద్ద రనౌత్ అయ్యాడు. అపుడు జట్టు స్కోరు 121 అటు తరువాత క్రీజులోకి వచ్చిన రహీమ్ ఎంతోసేపు నిలబడలేదు. జట్టు స్కోరు 133 వద్ద ఒక్క పరుగు చేసి థామస్ బౌలింగ్ లో హోప్ కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగారు. మొత్తమ్మీద 22 ఓవర్లు ముగియుసే సరికి బాంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. హాసన్ 54 పరుగులతోనూ, దాస్ మూడు పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories