Top
logo

సౌతాఫ్రికాకి చుక్కలు చూపించిన బంగ్లాదేశ్

సౌతాఫ్రికాకి చుక్కలు చూపించిన బంగ్లాదేశ్
Highlights

వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో తామాడుతున్న తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాట్సమెన్ రెచ్చిపోయారు. టాస్...

వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో తామాడుతున్న తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ బ్యాట్సమెన్ రెచ్చిపోయారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు భారీ స్కోరుతో సమాధానమిచ్చారు. అనామక జట్టుగా.. చిన్న వాళ్ళుగా కనిపించిన బంగ్లా బ్యాట్స్ మెన్ వరల్డ్ కప్ లో తమ బెస్ట్ స్కోరును నమోదు చేశారు. మొదట నుంచి నిదానంగా, నిలకడగా ఆడుతూ వచ్చిన బంగ్లాదేశే.. అంతే నిదానంగా భారీ స్కోరు శాశించింది.

బంగ్లా ఓపెనర్లు షకిబ్‌ అల్‌ హసన్‌ (75; 84 బంతుల్లో 8x4, 1x6), ముష్ఫికర్‌ రహీమ్‌(78; 80 బంతుల్లో 8x4) బాధ్యతాయుతంగా ఆడి భారీ స్కోరుకు పునాదులు వేశారు. చివర్లో మహ్మద్‌ మిథున్‌ (21; 21 బంతుల్లో 2x4 1x6), మహ్మదుల్లా(46; 33 బంతుల్లో 3x4, 1x6), మొసాడెక్‌ హుసేన్‌ (26; 20 బంతుల్లో 4x4) దూకుడుగా ఆడి 48 ఓవర్లలోనే స్కోరును 300 పరుగులు దాటించారు. ఆఖరి రెండు ఓవర్లలో 28 పరుగులు చెయ్యడంతో దక్షిణాఫ్రికా ముందు 331 పరుగుల భారీ లక్ష్యం ఉంచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్‌ తాహిర్‌, ఫెలుక్వాయో, క్రిస్‌ మోరిస్‌ తలో రెండు వికెట్లు తీశారు.

Next Story


లైవ్ టీవి