Top
logo

బీజేపీలోకి ప్రముఖ క్రీడాకారిణి!

బీజేపీలోకి ప్రముఖ క్రీడాకారిణి!
Highlights

భారత రెజ్లర్, అర్జున్ అవార్డు గ్రహీత బబిత ఫొగాట్ బీజేపీలో చేరారు. తండ్రి మహవీర్ సింగ్ తో కలిసి కేంద్రక్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో ఆమె కమల తీర్థం పుచ్చుకున్నారు.

భారత రెజ్లర్, అర్జున్ అవార్డు గ్రహీత బబిత ఫొగాట్ బీజేపీలో చేరారు. తండ్రి మహవీర్ సింగ్ తో కలిసి కేంద్రక్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో ఆమె కమల తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాల‌యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది. ఈ ఏడాది చివర్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారులైన బబిత, మహావీర్‌ బీజేపీ గూటికి చేరారు. 2014, 2018 కామన్‌వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన బబిత ప్రస్తుతం 'నాచ్‌ బలియే' డ్యాన్స్‌ షోలో పాల్గొంటున్నారు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకోనున్న సహ రెజ్లర్‌ వివేక్‌ సుహాగ్‌ ఈ షోలో ఆమెకు జోడీగా వ్యవహరిస్తున్నారు.


లైవ్ టీవి


Share it
Top