టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా
x
టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా
Highlights

భారత్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రసవత్తరపోరు జరగనుంది. వాంఖడే స్టేడియంలో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డే కీలకంగా మారింది. ఈ...

భారత్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రసవత్తరపోరు జరగనుంది. వాంఖడే స్టేడియంలో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియాకు రాజ్‌కోట్‌లో జరిగే రెండో వన్డే కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే భారత్ సిరిస్ ఆశలు నిలిచే చాన్స్ ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ కూడా మొదటి మ్యాచ్ లాగానే ఆడేందుకు సిద్ధమవుతోంది. రాజ్‌కోట్ వ‌న్డేలో ఇండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నున్నది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంద‌ని, త‌మ జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేద‌ని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆర‌న్ ఫించ్ తెలిపాడు. ఒక‌వేళ మేం టాస్ గెలిచినా, ముందు బౌలింగ్ ఎంచుకునే వాళ్లమ‌ని భార‌త కెప్టెన్ కోహ్లీ అన్నాడు.

టీమిండియా: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ (డబ్ల్యూ), విరాట్ కోహ్లీ (సి), శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శివం దుబే, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యదువ్ యుజ్వేంద్ర చాహల్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ (w), డి ఆర్సీ షార్ట్, అష్టన్ టర్నర్, జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జాంపా, అష్టన్ అగర్, పీటర్ హ్యాండ్స్‌కాంబ్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories