సమవుజ్జీల పోరులో ఆసీస్ దే విజయం ..

సమవుజ్జీల పోరులో ఆసీస్ దే విజయం ..
x
Highlights

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న ఆస్ర్టేలియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది . ఈ సమవుజ్జీల పోరులో ఆసీస్ పై చేయి సాధించింది . మొత్తం 86 పరుగుల...

ప్రపంచ కప్ లో భాగంగా నిన్న ఆస్ర్టేలియా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది . ఈ సమవుజ్జీల పోరులో ఆసీస్ పై చేయి సాధించింది . మొత్తం 86 పరుగుల తేడాతో ఆసీస్ పై న్యూజిలాండ్ ఓడిపోయింది . అయితే ఈ మ్యాచ్ లో ఇరుజట్ల బౌలర్ల ఆధిపత్యం నడించిందనే చెప్పాలి . మొదటగా బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ నిర్ణిత 50 ఓవర్లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది . ఇందులో ఖవాజా (88; 129 బంతుల్లో 5×4), కేరీ (71; 72 బంతుల్లో 11×4) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోర్ అయిన చేయగలిగింది ..

ఒక దశలో న్యూజిలాండ్ బౌలర్ల జోరు ముందు ఆసీస్ నిలువలేకపోయింది . 92 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్నా ఆసీస్ ని ఖవాజా,కేరీ ఆదుకున్నారు. అయితే చివరి ఓవర్లో న్యూజిలాండ్ బౌలర్ బౌల్డ్ అద్భుతమైన బౌలింగ్ తో హ్యట్రిక్ సాధించాడు . ఇది ప్రపంచ కప్ లో రెండో హ్యట్రిక్ కావడం విశేషం .. మొదటగా ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్ లో ఇండియన్ బౌలర్ షమీ ఈ ఘనతను అందుకున్నాడు .

244 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కి ఆసీస్ బౌలర్ల ధాటికి ఎక్కడ కూడా నిలువలేకపోయింది . మొత్తం 43.4 ఓవర్లోనే 157 పరుగులకే కుప్పకూలిపోయింది . ఇందులో అ జట్టు సారధి విలియమ్సన్ మరియు రాస్ టేలర్ మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్స్ చేసారు . మిచెల్‌ స్టార్క్‌ (5/26) కివీస్ పతనాన్ని కొనసాగించాడు . దీనితో 86 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయింది. ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ కి ఇది వరుసగా రెండో ఓటమి ..

Show Full Article
Print Article
Next Story
More Stories