మయాంక్ ఔట్.. నిలకడగా టీమిండియా..

మయాంక్ ఔట్.. నిలకడగా టీమిండియా..
x
Highlights

ఆసీస్‌తో జరుగుతున్న నాల్గవ టెస్టులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 34 ఓవర్ చివరి బంతికి మయాంక్ ఔట్ అయ్యాడు. ఫోర్లు, సిక్స్‌తో స్కోరు బోర్డును...

ఆసీస్‌తో జరుగుతున్న నాల్గవ టెస్టులో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. 34 ఓవర్ చివరి బంతికి మయాంక్ ఔట్ అయ్యాడు. ఫోర్లు, సిక్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన మయాంక్ 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర లియాన్ బౌలింగ్‌లో స్టార్క్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 39 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 139 పరుగులు. ప్రస్తుతం పుజారా(39), విరాట్ కోహ్లీ(7) పరుగులతో క్రీజులో నిలకడగా ఆడుతున్నారు.

కాగా టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌ ఆరంభంలోనే ఓపెనర్‌ రాహుల్‌(9) వికెట్‌ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి ఓపెనర్ మయాంక్‌ అగర్వాల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 29 ఓవర్లో రెండో బంతికి ఫోర్‌ కొట్టిన మయాంక్ హాఫ్ సెంచరీ చేశాడు. అతడికి సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా చక్కటి సహకారం అందించాడు. భారత బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌, రవీంద్రన్‌ అశ్విన్‌లకు తుది జట్టులో స్థానం లభించలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories