ఆస్ట్రేలియా పరుగుల మోత...టీమిండియా ఎదుట 314 పరుగుల లక్ష్యం

ఆస్ట్రేలియా పరుగుల మోత...టీమిండియా ఎదుట 314 పరుగుల లక్ష్యం
x
Highlights

రాంచీ వన్డేలో టీమిండియా ఎదుట కంగారూ టీమ్ భారీ లక్ష్యం ఉంచింది. 5 వికెట్లకు 313 పరుగుల స్కోరుతో పవర్ ఫుల్ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కు సవాల్...

రాంచీ వన్డేలో టీమిండియా ఎదుట కంగారూ టీమ్ భారీ లక్ష్యం ఉంచింది. 5 వికెట్లకు 313 పరుగుల స్కోరుతో పవర్ ఫుల్ టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ కు సవాల్ విసిరింది. ధోనీ హోంగ్రౌండ్ జార్ఖండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోటీలో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు ఓపెనర్లు ఆరోన్ ఫించ్, ఉస్మాన్ క్వాజా మొదటి వికెట్ కు 193 పరుగుల భాగస్వామ్యంతో అద్దిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. టీమిండియా బౌలర్లు ఆట మొదటి 31 ఓవర్లలో ఒక వికెట్టూ పడగొట్టలేకపోయారు. ఫించ్ 93, క్వాజా 104 పరుగులు సాధించారు. ఈ ఇద్దరూ అవుటైన తర్వాతే కంగారూజోరుకు విరాట్ సేన పగ్గాలు వేయగలిగింది. ఒకదశలో 2 వికెట్లకు 239 పరుగులు చేసి 350 స్కోరుకు ఉరకలేసిన కంగారూ టీమ్ చివరకు 313 పరుగుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, షమీ ఒక వికెట్ పడగొట్టారు. ధోనీ అడ్డా రాంచీ స్టేడియం వేదికగా ఆడిన నాలుగువన్డేలలో టీమిండియా 2-1 రికార్డు మాత్రమే ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories