ఆస్ట్రేలియా కప్ గెలుస్తుంది : గంభీర్

ఆస్ట్రేలియా కప్ గెలుస్తుంది : గంభీర్
x
Highlights

వరల్డ్ కప్ విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయం పై భిన్న అంచనాలను వ్యక్తం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు. విశ్లేషకులు. ఇపుడు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్...

వరల్డ్ కప్ విజేతగా ఎవరు నిలుస్తారు అనే విషయం పై భిన్న అంచనాలను వ్యక్తం చేస్తున్నారు మాజీ క్రికెటర్లు. విశ్లేషకులు. ఇపుడు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తాజాగా తన అభిప్రాయాన్ని చెప్పాడు. తన ఫేవరేట్ జట్టు ఆస్ట్రేలియా అని అన్నాడు. కచ్చితంగా కప్ గెలిచే చాన్సు ఆసీస్ కె ఉందన్నాడు గంభీర్. ఇంగ్లాండ్, ఇండియా రెండోస్థానానికే పోటీ పడతాయని చెప్పుకొచ్చాడు. ఇక భారత జట్టు తరఫున కోహ్లీ, రోహిత్‌ భారీ స్కోర్లు నమోదు చేస్తారని, బుమ్రా ఇండియాకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌లా ఉపయోగపడతాడని గంభీర్ అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లాండ్‌ తన సొంతగడ్డపై ఆడుతుండటమే ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అందులోనూ ఆ జట్టు మునుపటితో పోలిస్తే దృఢంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమతూకంగా ఉంది. నలుగురు ఆల్‌రౌండర్లు ఉండటం ఇంగ్లాండ్‌కు అదనపు బలం. అయితే, నా ఫేవరెట్‌ జట్టు మాత్రం ఆస్ట్రేలియానే.. ఎందుకంటే ఆ జట్టు ఫైనల్‌ చేరుకునేందుకు సరైన పక్కా ప్లాన్‌తో బరిలోకి దిగుతుంది. ఫైనల్‌లో ఆ జట్టు ఇండియా లేదా ఇంగ్లాండ్‌తో తలపడాల్సి రావొచ్చు. ఆసీస్‌ జట్టు మాత్రం కచ్చితంగా ఫైనల్‌ వరకూ చేరుకుంటుంది. ఛాంపియన్‌గా నిలవాలంటే జట్టులో ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆటగాళ్ల ఆత్మవిశ్వాసంపైనే విజయాలు ఆధారపడి ఉంటాయి. దాంతో పాటు తెలివైన ప్రణాళికలు కూడా కీలకమే' అని గౌతమ్ పేర్కొన్నాడు. గంభీర్‌ 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కీలక దశలో 97 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో భారత జట్టు శ్రీలంకను ఓడించి రెండో సారి ప్రపంచ విజేతగా నిలిచింది.

Show Full Article
Print Article
Next Story
More Stories