ధోనీ లాంటి మ్యాచ్ ఫినిషర్ కోసం చూస్తున్నాం : ఆస్ట్రేలియా కోచ్‌

ధోనీ లాంటి మ్యాచ్ ఫినిషర్ కోసం చూస్తున్నాం : ఆస్ట్రేలియా కోచ్‌
x
Highlights

ధోనీ లాంటి మ్యాచ్ ఫినిషర్ కోసం చూస్తున్నామని అన్నారు ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ .. ప్రపంచంలోని ప్రతి జట్టుకు బెస్ట్ మ్యాచ్ అవసరమని అన్నాడు....

ధోనీ లాంటి మ్యాచ్ ఫినిషర్ కోసం చూస్తున్నామని అన్నారు ఆస్ట్రేలియా కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ .. ప్రపంచంలోని ప్రతి జట్టుకు బెస్ట్ మ్యాచ్ అవసరమని అన్నాడు. ఇటీవల దక్షిణాప్రికాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓటములకి జట్టులో బెస్ట్ ఫినిషర్ లేకపోవడమే దీనికి కారణమని లాంగర్‌ అభిప్రాయపడ్డాడు. దీనితో ఇప్పుడు జట్టుకు ఫినిషర్ కావాల్సి వచ్చిందని అన్నాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను ఇందుకోసం ఉపయోగించుకుంటామని లాంగర్‌ పేర్కొన్నాడు.

ఒకప్పుడు ఆసీస్ టీంలో మైక్ హస్సీ, మైకెల్ బెవాన్ లాంటి వాళ్లు మ్యాచ్ ఫినిషర్లుగా ఉండేవారు. మ్యాచ్ ని ముగించడంలో వారు సిద్దహస్తలని, ప్రస్తుత తరంలో జట్టుకు అలాంటివాళ్ళు లేరని ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయాలని జస్టిన్‌ లాంగర్‌ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌లను ముగించడంలో ధోనీ ఓ మాస్టర్ అని పేర్కొన్నాడు. ఆలాగే ఇంగ్లాండ్ నుంచి జోస్ బట్లర్ ఆ భాధ్యతలను చక్కగా నెరవేరుస్తున్నాడని, ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క టీంలో ఒక్క ఫినిషర్ ఉండాలని పేర్కొన్నాడు.. ఇక దక్షిణాప్రికాతో జరిగిన సిరీస్‌లో నెం.6లో ఆడిన మిచెల్ మార్ష్ 32, 36 పరుగులు మాత్రమే చేశాడు.

ఇక భారత్ జట్టుకు తానే బెస్ట్ ఫినిషర్ అని ధోని పలుమార్లు నిరూపించాడు. ఆశలు వదిలేసిన ఎన్నో మ్యాచ్ లను ఒంటరిగా నిలబడి ధోని మ్యాచ్ లను గెలిపించిన సందర్బాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం ధోని జట్టుకు దూరం కావడంతో కే. యల్ రాహుల్ ఐదో నెంబర్ లో వచ్చి ఆ భాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.

ధోని రీఎంట్రీ :

గత ఏడాది ఇంగ్లాండ్ లో జరిగిన ప్రపంచ కప్ తర్వాత ఆటకు కొంతకాలం దూరం అయిన ధోని ఆర్మీ ఆఫీసర్ గా రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీలో పనిచేసి జవాన్‌గా దేశానికి సేవలను అందించాడు. ఆ తర్వాత వైల్డ్‌గ్రాఫ్ ఫొటో గ్రాఫర్, పిచ్ క్యూరెటర్ గా కనిపించాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2020 సీజన్ ఉండడంతో మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టి తన అభిమానులకి తన ఆటను చూపించేందుకు సిద్దం అవుతున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories