Top
logo

జ్యోతిష్కుల మాటే నిజమైంది

జ్యోతిష్కుల మాటే నిజమైంది
Highlights

ఐపీఎల్‌ సీజన్‌ 12 ఫైనల్‌ పోరులో జ్యోతిష్యమే గెలిచింది. మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు విజేతగా ముంబై ఇండియన్స్‌...

ఐపీఎల్‌ సీజన్‌ 12 ఫైనల్‌ పోరులో జ్యోతిష్యమే గెలిచింది. మ్యాచ్‌కు కొద్ది గంటల ముందు విజేతగా ముంబై ఇండియన్స్‌ నిలుస్తుందని పలువురు జ్యోతిష్కులు వెల్లడించారు. రోహిత్‌ శర్మకు, ముంబై ఇండియన్స్‌ జట్టుకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని వారు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలోనూ కెప్టెన్‌గా రోహిత్ శర్మ అద్భుతాలు సాధిస్తాడని, ధోనీకి అనుకూలంగా ఉన్న గ్రహాలు, అదృష్టం ఈసారి రోహిత్‌కు అనుకూలమయ్యాయని వారు వివరించారు. అయితే జో​తిష్యుల అంచనా ప్రకారం ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌ ట్రోఫీని నాలుగో సారి ముద్దాడింది. దీంతో తమ జ్యోతిష్యమే గెలిచిందని పలువురు సిద్దాంతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరిగిన ఫైనల్‌ పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌పై ఒక్క పరుగు తేడాతో ముంబై విజయం సాధించింది. అయితే గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం తప్పకుండా ఉండాలంటారు. నిన్నటి మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రతిభతో పాటు కాస్త అదృష్టం కూడా ముంబై విజయంలో కీలకపాత్ర పోషించింది. అయితే ఈ అదృష్టం రోహిత్‌కు ఉన్న గ్రహబలమేనని జ్యోతిష్యులు పేర్కొంటున్నారు.

Next Story

లైవ్ టీవి


Share it