సమిష్టిగా ఆడితే.. వారిని మించిన వాళ్ళు లేరు!

సమిష్టిగా ఆడితే.. వారిని మించిన వాళ్ళు లేరు!
x
Highlights

వరుసగా రెండు ప్రపంచ కప్ లు గెలిచి.. మూడో కప్ ఫైనల్ వరకూ చేరి.. ఇండియా చేతిలో ఖంగు తిన్న జట్టు విండీస్. ఇక అప్పట్నుంచీ వన్డే ల్లో ఎక్కడా పెద్దగా...

వరుసగా రెండు ప్రపంచ కప్ లు గెలిచి.. మూడో కప్ ఫైనల్ వరకూ చేరి.. ఇండియా చేతిలో ఖంగు తిన్న జట్టు విండీస్. ఇక అప్పట్నుంచీ వన్డే ల్లో ఎక్కడా పెద్దగా చెప్పుకోదగ్గ విజయం సాధించలేదు. ప్రపంచ కప్ లో అయితే మరీ దారుణం. ఒకే ఒక్కసారి 1996లో సెమీస్ వరకూ చేరుకుంది. అటు తరువాత ఆ జట్టు ఎక్కడా మెరవలేదు. సరికదా.. రోజు రోజుకూ తన ప్రాభవాన్ని కోల్పోయింది. 2015 నుంచి తానాడిన మ్యాచుల్లో క్రికెట్ లో పసికూనల చేతిలో కూడా ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో మూడు సార్లు ఓటమి పాలయింది. ఆఖరుకు జింబాబ్వే, ఐర్లాండ్ ల ముందు కుడా చేతులెత్తేసింది.


గెలుపు కోసం అర్రులు చాస్తున్న విండీస్ జట్టు ప్రధానంగా బ్యాటింగ్ మీదే ఆధారపడుతోంది. బ్యాటింగులో ఆ జట్టుకు ఉన్న బలం మరే జట్టుకు లేదంటే అతిశయోక్తి కాదు. బంతిని బౌండరీ బయటే చూడటానికి మాత్రమే ఇష్టపడే గేల్, రసెల్ లాంటి బ్యాట్స్ మెన్ ఆ జట్టుకు ప్రాధాన బలం. ఒక్కసారి లయకుదిరిందంటే చాలు గేల్, రసెల్ లు ప్రత్యర్థులకు చుక్కలు చూపెడతారు. ఇక వాళ్ల బౌలర్లకు పనే ఉండనంతగా బ్యాటింగ్ మెరుపులతోనే గెలిపించే సత్తా ఉన్నవాళ్లు. వీళ్ళకు తోడుగా హెట్ మయర్, ఎవిన్ లూయిస్, షై హాప్, డారెన్ బ్రావో ఉండనే ఉన్నారు. వీరిలో ఏ ఇద్దరు సరిగ్గా నిలబడినా.. ఇక పరుగుల ప్రవాహాన్ని ఆపడానికి ప్రపంచంలో ఏ బౌలరూ సరిపోరంటే అతిశయోక్తి కాదు.

మరెందుకు ఇలా?

అవును ఇంతటి బ్యాటింగ్ బలం ఉన్న జట్టు ఎందుకు ఓటమి బాటలో సాగుతోందనే అనుమానం క్రికెట్ అభిమానులకు ఉంది. ఆ జట్టు బలహీనత కూడా బ్యాటింగే అంటే ఆశ్చర్యం అనిపించినా.. వాస్తవం అదే. పొట్టి క్రికెట్ ఆడటంలో చూపిస్తున్న శ్రద్దే.. వన్డేల్లో విండీస్ జట్టు బ్యాట్స్ మ మెన్ పాలిట శాపంగా మారుతోంది. టీ 20 ల్లో ఎక్కువగా ఆడుతుండడం.. ఆ ఫార్మేట్ వేగమే వన్డేల్లోనూ చూపించడం.. వారి బలహీనత. అదే ప్రత్యర్థులు ఉపయోగించుకుంటున్నారు.


వన్డేల్లో నిలకడగా ఆడటం చాలా ముఖ్యం.. 50 ఓవర్ల పాటు జరిగే మ్యాచులో రెండు ఓవర్లలో 40 పరుగులు చేసేసి అవుతైపోతే.. తరువాతి బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెరిగి పోతుంది. వాళ్లు అపుడు నిలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నంలో దొరికిపోతారు. ఇదే విండీస్ అపజయాలకు ముఖ్యకారణం. టీ 20 ఫార్మేట్ వదిలి వన్డే వ్యూహాలకు పదును పెట్టుకుంటే విండీస్ కూడా సెమీస్ కు చేరే జట్టుల్లో ఒకటి కావడం ఖాయం. ఆ జట్టు ఇంకో ప్రాధాన లోపం.. సమిష్టిగా ఆడలేక పోవడం> ఎవరికీ వారు విడిగా అఖందులే. కానీ, అందరూ కలిసి పోరాటం చేయడం ఆ జట్టుకు లేదు. సమిష్టిగా ఆడాల్సిన జట్టు ఆట క్రికెట్. కనీ, ఎవరికీ వారే యమునా తీరే లా విండీస్ జట్టు క్రికెటర్లు ప్రవర్తిస్తుంటారు. అదే ఆ జట్టుకు శాపంగా మారింది. ఇక బౌలింగ్ లో రోచ్ ఒక్కడే అనుభవమున్న పేస్ బౌలర్.

ఈ నేపథ్యంలో అసలు గ్రూపు మ్యచులే దాటలేని జట్టుగా అందరూ అంచనా వేస్తున్న జట్టు విండీస్. కానీ, వారి బ్యాటింగ్ పరంగా సమిష్టిగా రానిస్తే అందరిలోనూ కొరకరాని కొయ్యగా మారగలిగే జట్టు కూడా వెస్టిండీస్ జట్టే!


వరల్డ్ కప్ కు వెస్టిండీస్ జట్టు ఇదే!

హోల్డర్ (కెప్టెన్), రసెల్, ఆష్లేనర్స్, బరాత్ వైట్, గేల్, డారెన్ బ్రావో, ఎవిన్ లూయీస్,

రోచ్, పురన్, ఒశేన్ థామస్, షై హాప్, గాబ్రియేల్, షెల్టన్ కొత్రెల్, హెట్ మయర్.

Show Full Article
Print Article
Next Story
More Stories