Top
logo

రాయుడుకు షాక్

రాయుడుకు షాక్
X
Highlights

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదిగా మే 30 నుంచి జరిగే వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ...

ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదిగా మే 30 నుంచి జరిగే వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ఖరారు చేసింది. కొహ్లీ నాయకత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో తెలుగుతేజం అంబటి రాయుడు, రిషభ్ పంత్ చోటు దక్కించుకోలేకపోయారు. తమిళనాడు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ కార్తీక్, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ అనూహ్యంగా జట్టులో చోటు సంపాదించారు. జట్టులోని ఇతర ఆటగాళ్లలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, బుమ్రా, రాహుల్, హార్థిక్ పాండ్యా, ధోనీ, చాహల్ ఉన్నారు.

Next Story