కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్‌

కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్‌
x
Highlights

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా జోఫ్రా...

ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ క్యారీకి బంతి తగిలి విలవిల్లాడిపోయాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా జోఫ్రా ఆర్చర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌ చివరి బంతి క్యారీ హెల్మెట్‌ నుంచి దూసుకుపోయి దవడ ముందు భాగానికి బలంగా తాకింది. దీంతో అతనికి తీవ్ర గాయమై.. రక్తం కూడా కారింది. వెంటనే స్పందించిన ఆస్ట్రేలియా మెడికల్ సిబ్బంది మైదానంలోకి వచ్చి.. అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే రిటైర్డ్ హర్ట్‌గా క్యారీ మైదానం నుంచి తప్పుకోకుండా..కట్టు కట్టుకుని మరీ బ్యాటింగ్‌ చేయడం అతనికి క్రీడపై ఉన్న నిబద్ధతకు అద్దం పడుతోంది.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories