Top
logo

ఆఫ్ఘనిస్థాన్ కు న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బ

ఆఫ్ఘనిస్థాన్ కు న్యూజిలాండ్ బౌలర్ల దెబ్బ
Highlights

వరల్డ్ కప్ టోర్నీ లో 13 వ మ్యాచ్ న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్...

వరల్డ్ కప్ టోర్నీ లో 13 వ మ్యాచ్ న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ మధ్య జరుగుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్లు ప్రపంచ కప్ లో తొలిసారి అధిక భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. హజ్రతుల్లా 28 బంతుల్లో 34 పరుగులు చేశాడు.. మరో ఓపెనర్ నూర్ ఆలీ 38 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అయితే, ఈ జోడీని నీషం విడదీశాడు. తొలుత హజ్రతుల్లా ను అవుట్ చేశాడు. తరువాత ఫెర్గుసన్ నూర్ ఆలీ ని అవుట్ చేసాడు. అటు తరువాత వచ్చిన ఆఫ్ఘాన్ బ్యాట్స్ మెన్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేదు. షా, గులాబుద్దీన్ లను నీషం డకౌట్ గా వెనక్కి పంపాడు. దీంతో 15 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసి కష్టాల్లో ఉంది. షాహిదీ సున్నా పరుగులతోనూ, నబీ ఒక్క పరుగు తోనూ క్రీజులో ఉన్నారు.లైవ్ టీవి


Share it
Top