ఐసీసీ వరల్డ్ కప్: ఆఫ్ఘనిస్థాన్‌కు భారీ షాక్

ఐసీసీ వరల్డ్ కప్: ఆఫ్ఘనిస్థాన్‌కు భారీ షాక్
x
Highlights

ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. పాకిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో గాయపడిన ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసకర ఆటగాడు/వికెట్...

ఐసీసీ వరల్డ్ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. పాకిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో గాయపడిన ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసకర ఆటగాడు/వికెట్ కీపర్ మహ్మద్ షాజాద్ (32) టోర్నీ నుంచి తప్పుకున్నాడు. కాగా, 2015 ప్రపంచకప్‌ నుంచి అఫ్గాన్‌కు ప్రధాన బ్యాట్స్‌మన్‌గా ఉన్న షెహజాద్‌ 55 మ్యాచ్‌ల్లో 1843 పరుగులు చేశాడు. అతను అఫ్గాన్‌ తరఫున అత్యధిక వన్డే పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. టాప్‌ ఆర్డర్‌లో కీలకమైన ఆటగాడిని కోల్పోవడం అఫ్గాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ. అతడి స్థానంలో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ఇక్ర్‌మ్‌ అలీకి స్థానం కల్పించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories