పసికూన అనుకుంటే అంతే సంగతులు!

పసికూన అనుకుంటే అంతే సంగతులు!
x
Highlights

వరల్డ్ కప్ క్రికెట్ అనగానే ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, న్యూజీలాండ్ ఇటువంటి దేశాలే గుర్తొస్తాయి అందరికీ. హాట్...

వరల్డ్ కప్ క్రికెట్ అనగానే ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంక, న్యూజీలాండ్ ఇటువంటి దేశాలే గుర్తొస్తాయి అందరికీ. హాట్ ఫేవరెట్లు గా వీటిలో ఏవో రెండు లేదా మూడిటిని లేక్కేసుకుంటారు. కానీ, చడీ చప్పుడు లేకుండా వచ్చి.. హాట్ ఫేవరేట్ అనుకున్న జట్లను ఖంగు తినిపించే సత్తా ఉన్న దేశాలూ ప్రపంచకప్ లో ఉన్నాయి. ఒక్కోసారి అవి కప్ గెలుస్తుంది అనుకున్న బలమైన జట్టును ఇంటి దారి పట్టించే సత్తా చూపించి కొంప ముంచేస్తాయి. అటువంటి వాటిలో ఈసారి ప్రపంచ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ ను ముందుగా చెప్పుకోవాలి.

ఏదన్న జట్టులో నలుగురు ప్రపంచస్థాయి ఆటగాల్లుంటే దానిని పసికూన అని ఎలా అనగలుగుతారు? సరిగ్గా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు వర్తిస్తుంది. రషీద్ ఖాన్, ముజీబ్ రెహమాన్, మహ్మద్ నబి వంటి వాళ్లు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్నారు. గత రెండేళ్లలో 42 మ్యాచులు ఆడిన ఆఫ్ఘనిస్తాన్ 23 మ్యాచులు నెగ్గింది. అంటే దాదాపు 50 శాతానికి పైగానే విజయాలు నమోదు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ చేతిలో వెస్టిండీస్ 3 సార్లు ఓడిపోయిందంటేనే దాని సత్తా తెలుస్తుంది. గత ఆసియా కప్ లో శ్రీలంక నూ ఓడించింది. అలా..ఇలా కాదు ఏకంగా 91 పరుగుల తేడాతో.. ఇక జింబాబ్వేను 7 సార్లు.. ఐర్లాండ్ ను 9 సార్లు చితక్కోట్టింది ఆఫ్ఘనిస్తాన్. టెస్ట్ హోదా కూడా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఈసారి వరల్డ్ కప్ లో సంచలనాలు నమోదు చేస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే, ప్రపంచ స్థాయి స్పిన్ బౌలింగ్ వారి ప్రత్యేకత. రషీద్ ఖాన్, మహ్మద్ నబి, ముజీబ్ రెహమాన్ లు ముగ్గురూ భిన్నమైన స్పిన్నర్లు. వికెట్ లు తీయడమే కాదు పొదుపుగా పరుగులు ఇవ్వడంలోనూ వీరు దిట్టలు. పవర్ ప్లే లో అద్భుతంగా బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న వాళ్లు. ఆఫ్ఘాన్ ప్రధాన సమస్య బ్యాటింగే.

ఇపుడు ఇంగ్లాండ్ పిచ్ లు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ ఆ జట్టు బౌలర్లు ఏ మేర రానిస్తారనే దానిపై వారి విజయావకాశాలు ఉంటాయి. ఇక పొతే ఇటువంటి టీములు కప్పు ఎలానూ కొట్టే చాన్స్ ఉండదని ఫిక్స్ అవుతాయి. అందుకే ఒత్తిడి ఉండదు. ప్రతీ మ్యాచ్ గెలవాలని పట్టుదలగా ఆడతారు. పోరాడితే తప్పేముంది ఇంకొంచెం అనుభవం వస్తుందన్నట్టు వారు ఆడతారు.

అందుకే.. ఎంత పెద్ద జట్టైనా సరే ఆఫ్ఘాన్ ను పసికూన అని అనుకుందో ఆ జట్టుకు తిప్పలు తప్పవు.

ఆఫ్ఘనిస్తాన్ టీం

గులాబదిన్ నైబ్ (కెప్టెన్), అస్ఘర్ ఆఫ్ఘాన్, హమీద్ హసన్, హజ్రతుల్ల షేజాద్, నజీబుల్ల జద్రాన్, రెహమత్ షా, సమియుల్ల షేన్వారి, కరీం జనాత్, అఫ్తాబ్ ఆలం, దావ్లాత్ జద్రాన్, హష్మతుల్ల షాహీద్, నబి ముజీబ్, నూర్ ఆలీ జద్రాన్, రషీద్ ఖాన్, ఇక్రం అలీ ఖిల్, షిర్జాద్.

Show Full Article
Print Article
Next Story
More Stories