పోలార్డ్ కు జరిమానా!

పోలార్డ్ కు జరిమానా!
x
Highlights

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ముంబయి గెలిచింది. ఈ మ్యాచులో ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ 25 బంతుల్లోనే 41 పరుగులు చేసి ముంబయి...

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ముంబయి గెలిచింది. ఈ మ్యాచులో ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు కీరన్‌ పొలార్డ్‌ 25 బంతుల్లోనే 41 పరుగులు చేసి ముంబయి విజయానికి మూల స్తంభములకా నిలబడ్డాడు. అయితే, చెన్నై బౌలర్‌ డ్వేన్‌ బ్రావో వేసిన చివరి ఓవర్‌లో వరుసగా రెండు బంతులు ట్రామ్‌లైన్స్‌ దాటి దూరంగా వెళ్లాయి. మొదటి బంతిని ఆడేందుకు ప్రయత్నించిన పొలార్డ్‌.. రెండో బంతి కూడా దూరంగా వెళ్లడంతో వైడ్‌గా భావించి వదిలేశాడు. వైడ్‌గా వెళ్లిన ఈ రెండు బంతులను ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ నితిన్‌ మీనన్‌.. లీగల్‌ బంతులుగానే గుర్తించాడు. క్రీజ్‌కు దూరంగా బంతులు వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అంపైర్‌ వైడ్‌ ఇవ్వకపోవడంతో పొలార్డ్‌కు బాగా కోపం వచ్చింది. కోపాన్ని అణచుకోలేకపోయిన పొలార్డ్‌ బ్యాటును గాల్లోకి ఎగరవేశాడు. ఆ తర్వాత బంతి వేసేందుకు బ్రావో సన్నద్ధమవుతుండగా.. అంతకుముందు బంతి ఎక్కడి నుంచి వెళ్లిందో దాదాపు అక్కడ (ట్రామ్‌లైన్స్‌ దగ్గర) నిలబడి బ్రేవోను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. పొలార్డ్‌ వికెట్లకు పూర్తిగా పక్కకు జరగడంతో బౌలింగ్‌ చేసేందుకు వచ్చిన బ్రేవో మధ్యలో విరమించుకోవాల్సి వచ్చింది. క్రీజ్‌ నుంచి బయటకు వచ్చి.. .. పోలార్డ్‌ అసహనం ప్రకటించడంతో బిత్తరపోయిన ఇద్దరు అంపైర్లు అతని వద్దకు వచ్చి సముదాయించారు. ఇలా చేయడం అపుడు చూసే వాళ్ళకి సరదాగా అనిపించింది. కానీ, పాపం పోలార్డ్ కు మాత్రం సరదా తీరింది. అతని చేష్టలు ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని ఐపీఎల్ యాజమాన్యం భావించింది. ఐసీసీ రూల్స్ ప్రకారం అది తప్పని నిర్ధారించింది. పోలార్డ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. పాపం పోల్లార్డ్. అన్నట్టు ఆదివారం అతని పుట్టినరోజు కూడా..

Show Full Article
Print Article
Next Story
More Stories