ఆరు బంతుల్లో ఆరు సిక్సుల ఫీట్ కి 12 ఏళ్ళు

ఆరు బంతుల్లో ఆరు సిక్సుల ఫీట్ కి 12 ఏళ్ళు
x
Highlights

క్రికెట్ లో సింగ్సిల్స్ కంటే ఫోర్లకు, సిక్సులకు ఉండే కిక్కే వేరు. ఓ ఓవర్లో ఓ ఫోర్ పడ్డా, సిక్స్ పడ్డా ఆ ఆనందానికి అవధులుండవు అలాంటిది ఆరు బాళ్ళకు ఆరు...

క్రికెట్ లో సింగ్సిల్స్ కంటే ఫోర్లకు, సిక్సులకు ఉండే కిక్కే వేరు. ఓ ఓవర్లో ఓ ఫోర్ పడ్డా, సిక్స్ పడ్డా ఆ ఆనందానికి అవధులుండవు అలాంటిది ఆరు బాళ్ళకు ఆరు సిక్సులు పడితే అవధుల్లేని ఆనందం కదూ! యువరాజ్ సింగ్ క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కరలేని పేరు. ఆల్ రౌండ్ ఆటకు పెట్టింది పేరు. యువీ క్రిజ్ లో ఉంటే చాలు ఆ మజాని ఆస్వాదించే క్రికెట్ అభిమానులకే తెలుసు ఒకే ఓవర్లో సిక్స్ బాల్స్ కి సిక్స్ సిక్సర్లు కొట్టి అదరగొట్టిన రోజుకు ఈ రోజుతో 12 ఏళ్ళు.

2007 సెప్టెంబర్ ‌19వ తేదీన, మొదటి టీ 20 ప్రపంచ కప్ డర్బన్ వేదికగా ఇంగ్లాండ్ మీద ఇండియా ఆడుతున్నది. తప్పక గెలవాల్సిన మ్యాచ్. యువీ ధోనీ క్రిజ్ లో ఉన్నారు. అప్పటికి ఇండియా స్కోర్ మూడు వికెట్లకు 171. మరో రెండు ఓవర్లు మిగిలి ఉన్నాయి. అవసరంగా అండ్రూ ఫ్లింటాఫ్ యువీని కెలికాడు. ఆ ఇన్నింగ్స్ 18వ ఓవర్ ని స్టూవర్ బ్రాడ్ వేశాడు. మొదటి బాల్ యువీ బ్యాట్స్ మన్... రెండో బంతిని విసిరాడు బ్రాడ్...ఆకలి గొన్న పులిలా... యువీ...బాల్ పడింది. జస్ట్ ఫ్లిక్ చేశాడు. అంతే... మూడో బంతి... బల్లే బల్లే..... నేరుగా స్టాండ్స్ లోకి...నాలుగో బంతి... వరసగా నాలుగో బంతి...ఫుల్ టాస్... వైడ్ బాల్... సేమ్ రిజల్ట్...ఐదో బంతి... ...ఫుల్ టాస్... వైడ్ బాల్... సేమ్ టు సేమ్ రిజల్ట్... ఆరో బంతి...అంతా ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. ఇంకో సిక్స్ కొడితే చాలు... ఆరు బంతుల్లో ఆరు సిక్సులు... వాల్డ్ రికార్డు అవుతుంది. అందరిలో టెన్షన్... రోమాలు నిక్కబొడుచుకున్న టెన్షన్... బ్రాడ్...పరుగు మొదలు పెట్టాడు...బొబ్బిలిలా...యువరాజ్...యస్... యువీ సాధించాడు... వరసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సులు.

యువీదే ఇప్పటికీ వాల్డ్ రికార్డ్. టీ 20 ల్లో ఆరు బాళ్ళకి ఆరు సిక్సులు... అలాగే 12 బంతుల్లో హాఫ్ సెంచరీ... యువీ దెబ్బకి 171గా ఉన్న స్కోరు ఆరు బంతుల తర్వాత 207కు చేరింది. ఇందులో విశేషమేంటంటే ఆ టీ20 కప్పు భారత్ గెలిచింది. ఆ టీమ్ కి కెప్టెన్ ధోనీ...ధోనీ క్రిజ్ లో ఉండగానే యూవీ ఈ ఫీట్ సాధించాడు. మరోవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సిక్స్ బాల్స్ కి సిక్స్ సిక్సెస్ కొట్టిన రవి శాస్త్రి కామెంటేటర్ గా ఉండటం. పాపం ఫ్లింటాఫ్...అనవసరంగా యువీని గెలికాడు. అప్పటికి కొత్త కుర్రాడు బ్రాడ్ ని చూసి అంతా జాలిపడ్డారు. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు నిశ్చేష్టులై ప్రేక్షకులుగా మారారు. ప్రేక్షకుల ఆనందాలకి అవధుల్లేవ్. కామెంటేటర్ల నోళ్ళకి విరామం లేదు. ఈ ఫీట్ ఇప్పటికీ...ఎప్పటికీ ఎవర్ గ్రీన్...అత్యంత ట్రెండింగ్ వీడియోగా మారింది. ది బెస్ట్...ఇన్ టీ ట్వంటీస్...దటీజ్ యూవీ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories