Top
logo

ముగిసిన భారత్ బ్యాటింగ్.. అప్గాన్ లక్ష్యం ఎంతంటే..

ముగిసిన భారత్ బ్యాటింగ్.. అప్గాన్ లక్ష్యం ఎంతంటే..
Highlights

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా రోజ్ బౌల్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్ ముగిసింది....

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా రోజ్ బౌల్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు అఫ్గానిస్థాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న భారత్‌ను తక్కువ స్కోరుకే కుప్పకూల్చింది. కోహ్లీ(67; 63బంతుల్లో 5×4), జాదవ్‌(52; 68బంతుల్లో 3×4, 1×6) అర్ధశతకాలతో రాణించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించారు. అఫ్గాన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్(2 51), మహ్మద్ నబీ(2/33), ముజీబ్ రెహ్మన్(1/26), రషీద్ ఖాన్(1/38) గొప్పగా బౌలింగ్ చేశారు.


లైవ్ టీవి


Share it
Top