నేడే ఫైనల్ మ్యాచ్ .. వైట్ వాష్ చేస్తే రికార్డే

నేడే ఫైనల్ మ్యాచ్ .. వైట్ వాష్ చేస్తే రికార్డే
x
Highlights

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. అయిదు మ్యాచ్ ల టీ 20సీరీస్ లో భాగంగా ఇప్పటికే 4-0తో ముందజలో ఉన్న భారత్ తన చివరి...

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. అయిదు మ్యాచ్ ల టీ 20సీరీస్ లో భాగంగా ఇప్పటికే 4-0తో ముందజలో ఉన్న భారత్ తన చివరి మ్యాచ్ ని ఈ రోజు ఆడనుంది. ఒక పక్క ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ని వైట్ వాష్ చేయాలని భారత్ చూస్తుంటే మరో పక్కా ఈ ఒక్క మ్యాచ్ లో అయిన గెలిచి అయిన పరువు కాపాడుకోవాలని న్యూజిలాండ్ జట్టు ఆశిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే అది ఒక ప్రపంచ రికార్డు అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అయిదు మ్యాచ్ ల టీ 20సీరీస్ ని ఇప్పటివరకు ఎ జట్టు కూడా క్లీన్ స్వీప్ చేసింది లేదు.. ఇక ఇరు జట్ల బలాబలాలు ఒక్కసారి పరిశీలిస్తే..


న్యూజిలాండ్ :

బలమైన జట్టుగానే న్యూజిలాండ్ ఉన్నప్పటికీ విజయాలని అందుకోలేకపోతుంది. ఇక ఆ జట్టు కెప్టెన్ విలియమ్సన్ నాలుగో టీ 20 కి దూరం అవ్వడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బని తీసిందని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో కూడా అతను ఆడడం అనుమానంగానే కనిపిస్తుంది. నాలుగో టీ 20 మ్యాచ్ లో ఆడిన జట్టే ఈ మ్యాచ్ లో కూడా కొనసాగే అవకాశం ఉంది. కోలిన్, మన్రో, సీవర్ట్ మళ్ళీ ఫాంలోకి రావడం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక సీనియర్ ఆటగాళ్ళు అయిన రాస్ టేలర్, గుప్తిల్, సౌదీ నుంచి ఆ జట్టు భారీగానే ఆశిస్తోంది.


భారత్ :

అన్ని విభాగాల్లోనూ భారత్ పటిష్టంగానే కనిపిస్తోంది. మొదటి రెండు మ్యాచ్ లలో బ్యాటింగ్ తో అదరగొట్టిన భారత్ మిగలిన రెండు మ్యాచ్ లలో బౌలింగ్ లో రాణించింది. అయితే ఈ మ్యాచ్ లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ కోహ్లికి విశ్రాంతిని ఇచ్చి రోహిత్ కి కెప్టెన్సీ భాద్యతని అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని రిషబ్ పంత్ కు జట్టులో చోటు లభించనుంది. అంతేకాకుండా కులదీప్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రాహుల్ , చాహల్ కి రెస్ట్ ఇవ్వనున్నారు.

మ్యాచ్ భారత కాలమాన ప్రకారం 12 గంటలకి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య వన్డే, టెస్ట్ సిరీస్ లు ప్రారంభం కానున్నాయి. .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories