ప్రపంచం లోనే ఎత్తైన చెత్త కుప్ప ఎక్కడుందో తెలుసా?

ప్రపంచం లోనే ఎత్తైన చెత్త కుప్ప ఎక్కడుందో తెలుసా?
x
Highlights

ఎవరెస్టు ప్రపంచం లోనే ఎత్తైన చెత్త కుప్ప గా మారిపోయింది. అవును, మీరు చదువుతున్నది నిజమే. ఏమిటి నమ్మలేం అంటున్నారా.. అయితే ఈ వివరాలు మీకోసమేఏప్రిల్ 14...

ఎవరెస్టు ప్రపంచం లోనే ఎత్తైన చెత్త కుప్ప గా మారిపోయింది. అవును, మీరు చదువుతున్నది నిజమే. ఏమిటి నమ్మలేం అంటున్నారా.. అయితే ఈ వివరాలు మీకోసమే

ఏప్రిల్ 14 నుంచి మే 8 వరకు ఎవరెస్టు పర్వతం మీద స్వచ్ఛత కార్యక్రమాన్ని చేపట్టింది నేపాల్ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఎవరెస్టు పర్వత శిఖరాల్లో చెత్తను ఏరివేసే ప్రక్రియను నిర్వహించారు. దాదాపు 5 టన్నుల చెత్తను ఈ క్రమంలో ఏరుకుని కిందకు తీసుకు వచ్చినట్టు నేపాల్ పర్యాటక శాఖ డైరెక్టర్ జనరల్, దండూ రాజ్ ఘిర్మి తెలిపారు. ముందు 3 టన్నుల చెత్తను తీసుకు వచ్చి హెలికాఫ్టర్ల ద్వారా తరలించినట్టు ఆయన చెప్పారు. నేపాల్ టూరిజం సంస్థ చెత్తను గ్రేడింగ్ చేయడానికి బ్ల్యూ వేస్ట్ వాల్యూ కంపెనీని నియమించింది పోగుపడిన చెత్తలో వెయ్యి కేజీలు ఇప్పటికే ఆ సంస్థకు పంపించినట్టు దండు రాజ్ చెప్పారు. ఈ చెత్తలో ఆక్సిజన్ కాన్లు, పిలాస్టిక్ టిన్నులూ, మానవ వ్యర్థాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడానికి వచ్చే పర్వతారోహకులు కొన్నేళ్లుగా చెత్తను అక్కడే పారవేయడం తో ఈ దుస్థితి వచ్చిందన్నారు. ప్రపంచం లోనే ఎత్తైన డంపింగ్ యార్డ్ గా దీనిని మార్చేశారని ఆయన చెప్పారు.

ఈ పారిస్తాటిని దృష్టిలో పెట్టుకుని గత కొన్నేళ్లుగా ఎవరెస్టు ఎక్కే ప్రతి ఒక్కరు తిరిగి వచ్చేటప్పుడు 8 కిలోల చెత్తను తీసుకుని రావాల్సిందిగా నియమాన్ని విధించింది నేపాల్ ప్రభుత్వం. ఒక పర్వతారోహకుడు సగటున 8 కిలోల చెత్తను వదిలి వేస్తారన్న అంచనాతో ఈ నిబంధన విధించారు.

ఎవరెస్టు లో చెత్తను తరలించడానికి 23 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు ను అంచనా వేశారని, ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే ఎక్కువే ఖర్చవుతుందని రాజ్ చెప్పారు. స్వచ్చంద సంస్థలు కొన్ని ఈ కార్యక్రమానికి విరాళాలిస్తున్నాయని ఆయన వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories