కొత్త సర్పాన్ని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

కొత్త సర్పాన్ని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు
x
Highlights

అనుకోకుండా ఒక్కోసారి అద్భుతాలు జరుగుతాయి. చరిత్రలో చాలా సంఘటనలు ఎన్నో కొత్త విషయాలకు ప్రేరణ అయ్యాయి. అటువంటిదే ఇది కూడా. మన దేశానికి చెందిన...


అనుకోకుండా ఒక్కోసారి అద్భుతాలు జరుగుతాయి. చరిత్రలో చాలా సంఘటనలు ఎన్నో కొత్త విషయాలకు ప్రేరణ అయ్యాయి. అటువంటిదే ఇది కూడా. మన దేశానికి చెందిన పరిశోధకులు రోహన్ పండిట్, వాంగ్ ఛు ఫియాంగ్ అరుణాచల్ ప్రదేశ్ లో బయోడైవర్సిటీ పై పరిశోధనలు చేస్తున్నారు. 2016 సంవత్సరం లో మేనెల్లో ఒకరోజు వీరిరువురూ తమ పరిశోధనల్లో భాగంగా అరణ్యంలో సంచరిస్తున్నారు. ఆ సమయంలో ఓ చెట్టుకింద రాలిపడి కుళ్లిపోతున్న ఆకుల మధ్యలో ఉన్న ఓ పామును చూశారు. ఇదేదో కొత్తగా ఉందే అనుకున్నారు. ఎందుకన్నా మంచిదని సంచిలో వేసుకున్నారు.

వాళ్ల పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి దాని సంగతి చూద్దామని కూర్చున్నారు. వారు అనుకున్నట్టు అంత సులభంగా అది ఏ రకమైన పామో తేలలేదు. విస్తృతంగా దానిపై పరిశోధనలు చేయడం మొదలు పెట్టారు. అది పిట్ వైపర్ లక్షణాలున్న పాముగా ముందు గుర్తించారు. కానీ, పిట్ వైపర్ కు చెందిన జాతుల పాముల్లో వేటితోనూ వీటి లక్షణాలు పూర్తిగా సరిపోలేదు. తరువాత దానిపై మరింత లోతైన పరిశోధన జరిపారు. దాని డీఎన్ఏ ని కూడా పరీక్షించారు. ఎన్నో పరిశోధనలు అనంతరం అది పిట్ వైపర్ రకానికి చెందిన సర్పమే కానీ, కొత్త జాతిగా నిర్ధారించారు. ఈ మేరకు వారు ఓకే పరిశోధనా పత్రాన్ని సమర్పించారు.

తమ ఎదుట ఉన్న జీవుల శరీరం లోని వేడి ద్వారా అది ఏ తరహా జీవో అంచనా వేయడం ఈ పాము ప్రత్యేకత. దాని ఆధారంగానే వేటాడుతుందాని వారు గుర్తించారు. దీనికి గాను పిట్ వైపర్ పాములకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని తమ పత్రంలో తెలిపారు. ఇది ముదురు ఎరుపు, గోధుమ రంగుల కలయికతో స్థానిక చెట్ల రంగులతో కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. పిట్ వైపర్లు సంతానోత్పత్తి క్రమంలో గుడ్లు పెడతాయా? లేక నేరుగా పిల్లల్ని కంటాయా? అనే విషయంపై శాస్త్రజ్ఞులు పరిశోధనలు సాగించనున్నారు. కాగా, ఈ పాముకు అరుణాచల్ ప్రదేశ్ పేరుమీదుగా 'ట్రిమెరుసురస్ అరుణాచలెన్సిస్' ( అరుణాచల్ పిట్ వైపర్) అని నామకరణం చేశారు.

దీనిమీద మరిన్ని పరిశోధనలు సాగించాల్సి ఉందని వారు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories