Top
logo

జాగ్రత్త : అక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు...

జాగ్రత్త : అక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు...
X
Highlights

రోడ్డు ప్రమాదాలు ఎదో విధంగా జరుగుతూనే ఉన్నాయి. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కారణాలు ఏమైనా కానీ వీటిని...

రోడ్డు ప్రమాదాలు ఎదో విధంగా జరుగుతూనే ఉన్నాయి. వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కారణాలు ఏమైనా కానీ వీటిని అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు మరింత జాగ్రత్తలు పాటిస్తున్నారు. నగరంలోకి వచ్చేసరికి వాహనలను వాహనదారులు చాలా నియమ నిబంధనలుతో నడుపుతున్నారు. ఎందుకంటే సీసీ కెమరాలు, ట్రాఫిక్ పోలీసులు ఉన్నారన్న భయంతో .. కానీ నగర శివారులో మాత్రం అందుకు భిన్నంగా, మితిమీరిన వేగంతో వెళ్తుంటారు. అలాంటి వాళ్ళను పట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు దాదాపుగా అన్ని రోడ్లపై నిఘా వేశారు... తాజాగా రోడ్ల పక్కన పొదల్లోకెళ్లి మరీ అత్యాధునిక కెమెరాలతో వేగంగా వాహనాలను నడిపే వాహనదరులను పట్టుకునేందుకు సిద్దం అయ్యారు. దీనికి సంబంధించి రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ శివార్లలోని బైపాస్ రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు కెమెరాలతో వాహనదారుల వేగాన్ని గమనించడం ఆ ఫొటోల్లో మనం స్పష్టంగా చూడొచ్చు.

Next Story