కాలితో నలిపేద్దామని.. పాపం.. కాటికి పోయాడు!

కాలితో నలిపేద్దామని.. పాపం.. కాటికి పోయాడు!
x
Highlights

ఒక్కోసారి అతి విశ్వాసం ప్రాణాలు తీస్తుంది. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. చిన్న పామును కర్రతో కొట్టడమెందుకు? కాలితో నలిపేస్తే పోతుందని భావించిన ఓ వ్యక్తి.....

ఒక్కోసారి అతి విశ్వాసం ప్రాణాలు తీస్తుంది. అందుకు ఉదాహరణే ఈ సంఘటన. చిన్న పామును కర్రతో కొట్టడమెందుకు? కాలితో నలిపేస్తే పోతుందని భావించిన ఓ వ్యక్తి.. పాము కాటుకు బలైపోయాడు. హిందూపురంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘటన చూసిన స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురం.. పరిగి ప్రాంతంలో ఓ పాము రోడ్డుపైకి వచ్చింది. దానిని చూసిన పిల్లలు కట్టెలతో కొట్టడానికి సిద్ధమయ్యారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన అహ్మద్‌నగర్‌ కమేళ ప్రాంతానికి చెందిన సులేమాన్‌(50) పిల్లలను పామును కొత్తవద్దనీ, కట్టెలతో కొట్టే పనిలేదు.. చిన్న పామేగా.. కాలితో చంపేయొచ్చు అని చెప్పాడు. అన్నట్టుగానే పామును కాలితో తొక్కాడు. దీంతో పాము రెండుసార్లు కాలిపై కాటేసింది. అయినా లెక్కచేయని సులేమాన్.. అచేతనంగా ఉన్న పాముని చచ్చిపోయిందనుకుని చేత్తో తీసి పారేద్దామని ప్రయత్నించాడు. దీంతో ఆ పాము మరోసారి చేతిపై కాటు వేసింది. అంతే.. పదినిమిషాల తరువాత సులేమాన్ నోట్లో నురగలు కక్కుతూ కింద పడిపోయాడు. స్థానికులు అతనిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అతనిని పరిశీలించి మృతి చెందినట్టు ధ్రువీకరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories