భార్యను మోసే పోటీ..గెలవడం అంత వీజీ కాదండీ!

భార్యను మోసే పోటీ..గెలవడం అంత వీజీ కాదండీ!
x
Highlights

భార్యను మోసుకుంటూ వెళితే బోలెడు డబ్బిస్తారు. భలే ఉండనుకున్తున్నారా? అది అంత వీజీ కాదు.. ఇదో పోటీ. 253.5 మీటర్ (277 గజాలు) దూరాన్ని భార్యను మోసుకుంటూ...

భార్యను మోసుకుంటూ వెళితే బోలెడు డబ్బిస్తారు. భలే ఉండనుకున్తున్నారా? అది అంత వీజీ కాదు.. ఇదో పోటీ. 253.5 మీటర్ (277 గజాలు) దూరాన్ని భార్యను మోసుకుంటూ వెళ్ళాలి. దాందేముంది ప్రయత్నిస్తే లాగించేయోచ్చు అనుకోకండి.. మధ్యలో ఓ నీటి గుంత కూడా ఉంటుంది. ఎక్కడా భార్యను కిందకి దించడం కానీ, ఆమె నెలకు తగలడం కానీ జరగకుండా నీటి గుంతను కూడా దాటుకుంటూ వెళ్ళాలి. అదీ పోటీ. ఇప్పుడు చెప్పండి మీరు ధైర్యం చేయగలరా? సరే.. ఇంతకీ ఇదెక్కడో తెలుసా? ఫిన్లాండ్ లో ఈ పోటీలని నిర్వహించారు. అన్నట్టు ప్రతీ సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తారు.

ఈ ఏడాదీ పోటీని నిర్వహించారు. ఈ పోటీలో మొత్తం 24 జంటలు పాల్గొన్నాయి. వారిలో వైటాటాస్ కిర్క్లియాస్కాస్, అతని భార్య నెరింగా కిర్క్లియాస్కీన్ విజేతలుగా నిలిచారు. వీరి జంట ఈ పోటీలో గెలవడం వరుసగా రెండోసారట. గతేడాది కూడా వీరే గెలిచారు. ఈ పోటీల్లో వీరు గెలిచింది గతంలో ఆరుసార్లు విజేతలుగా నిలిచిన ఫిన్లాండ్‌కు చెందిన టైస్టో మియెట్టినెన్, అతని భాగస్వామి కట్జా కోవనెన్ జంట మీద. ఇంతకీ ఈ గెలుపు కూడా వెంట్రుక వాసిలో అంటే కేవలం 0.1 సెకన్లు తేడాతో గెలిచారు. నిజంగా గ్రేట్ కదూ. విజేత కూడా అదే చెబుతున్నాడు. ఇది అద్భుతం నేను ఓడిప్యాననుకున్నాను. కానీ అదృష్టం గెలిచానని సంబర పడిపోతున్నాడు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కేవలం ఒక్క నిమిషం ఆరు సెకన్లలో ఈ దూరాన్ని దాటేశాడు ఈ విజేత.

ఈ పోటీలు 24 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా జరుగుతున్నాయి. 19 వ శతాబ్దానికి చెందిన రాంకైనెన్ రాబర్ అనే దొంగ కథ నుంచి స్ఫూర్తి పొంది ఈ పోటీలను ఇక్కడ నిర్వహిస్తున్నారు. దొంగతనాలకి పనికి వస్తారో రారో తేల్చుకోవడానికి రాంకైనెన్ ఇటువంటి పోటీ పెట్టేవాడట. దొంగతనం చేసి బరువులు మోసుకుంటూ పారిపోగలరో లేదో తెల్సుకోవడానికి. అయితే, ఈ పోటీల్లో ధాన్యం మూతలు కానీ, బతికి ఉన్న పందుల్ని గానీ ఉపయోగించేవారు. ఇపుడు భార్యలను మోసుకు వెళ్ళేలా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో పాల్గోవడానికి, చూడటానికి ప్రపంచవ్యాప్తంగా జనం వస్తారు. అంతే కాదు ఈ పోటీల్లో పాల్గొనే వారికి ఎంపిక పోటీలు (ప్రిలిమినరీస్) నిర్వహిస్తారు. వెబ్సైట్ ల ద్వారా ప్రచారం చేసి.. ప్రిలిమినరీస్ నిర్వహించి అందులో ఎంపికయిన వారిని ఫైనల్స్ ఫిన్లాండ్ లో నిర్వహిస్తారు. అదండీ విషయం. మీకు కూడా ఇంటరెస్ట్ ఉంటే ఇంటర్నెట్ లో వెతికి వచ్చే సంవతరం జరిగే పోటీలకు సిద్ధం అయిపోండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories