

Anantapur: రేపే అనంతపురం నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం
అనంతపూర్: అనంతపురం నగరపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం నగరంలోని ఎస్.ఎస్.బి.ఎన్. కళాశాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ప్రతి కౌంటింగ్ హాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.


Warangal: ఎల్ నినో ప్రభావంపై పాటల సీడీని ఆవిష్కరించిన కలెక్టర్!
ఎల్ నినో ప్రభావం, జల సంరక్షణపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రూపొందించిన పాటల సీడీని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆవిష్కరించారు. ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ప్రత్యామ్నాయ పంటలపై ప్రజలకు పాటల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో ప్రేమలత, రచయితలు, కళాకారులు పాల్గొన్నారు.


Warangal: మురాసు తుపాను హెచ్చరిక: కలెక్టర్ సత్య శారద అలర్ట్!
మురాసు తుపాను దృష్ట్యా వరంగల్ జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర సహాయం కోసం కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3424తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


Giddalur: కంభం చెరువును తనిఖీ చేసిన మార్కాపురం కలెక్టర్ విజయ సునీత
గిద్దలూరు: మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మురసు తుఫాను ప్రభావంతో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత సోమవారం చారిత్రాత్మక కంభం చెరువును క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరువు నీటి మట్టం, అలుగు పారే పరిస్థితులు, కట్ట భద్రతను ఆమె స్వయంగా పరిశీలించారు.


Nagarkurnool: క్రీడారంగంలో రికార్డు: తెప్ప శ్రీనివాస్‌ను సత్కరించిన మంత్రి!
నాగర్‌కర్నూల్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు లయన్ డాక్టర్ తెప్ప శ్రీనివాస్‌కు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రశంసా పత్రం, మెడల్ అందజేశారు. 55 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం యువతకు ఆదర్శమని మంత్రి కొనియాడారు. జిల్లా ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు ఆయనకు అభినందనలు తెలిపారు.


Mancherial: ఏక్తా దివస్ పరేడ్‌లో మంచిర్యాల బృందం ప్రతిభ!
సర్దార్ వల్లభభాయ్ పటేల్ 151వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఏక్తా నగర్లో జరిగిన ఏక్తా దివస్ పరేడ్‌లో మంచిర్యాల జిల్లా నుంచి 13 మంది సభ్యుల బృందం పాల్గొంది. పర్యటన ముగించుకుని వచ్చిన బృందాన్ని నస్పూర్ కలెక్టరేట్లో కలెక్టర్ కుమార్ దీపక్ అభినందించారు. జాతీయ సమగ్రతపై విద్యార్థులకు అవగాహన పెరిగిందన్నారు.


Eluru: రేపే ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక కౌంటింగ్
ఏలూరు: ఏలూరు నగరపాలక సంస్థ,నూజివీడు,జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలకు ఈనెల 1వ తేదీన పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఈనెల 3వ తేదీ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏలూరులోని సర్.సి.ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో,నూజివీడు పురపాలక సంఘానికి సంబంధించి నూజివీడులో సారధి ఇంజనీరింగ్ కళాశాలలో,జంగారెడ్డిగూడెం పురపాలక సంఘానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద నవంబర్ 3వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది.


Nagarkurnool: తుపాను హెచ్చరిక: నాగర్‌కర్నూల్ విద్యుత్ శాఖ అలర్ట్!
రానున్న నాలుగు రోజులు తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో నాగర్‌కర్నూల్ టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఈ నర్సింహారెడ్డి సూచించారు. విద్యుత్ పునరుద్ధరణ కంటే ప్రాణ భద్రతే ముఖ్యమని, లైన్మెన్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తెగిపడిన తీగల వద్దకు ప్రజలు వెళ్లొద్దని హెచ్చరించారు.


Bhadrachalam: గిరిజన విద్యార్థులకు రాజీవ్ విద్యా దీవెన అందేలా చూడాలి: ఐటీడీఏ పీవో
Bhadrachalam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 9, 10 తరగతుల గిరిజన విద్యార్థులకు కేంద్రం ఇచ్చే రాజీవ్ విద్యా దీవెన స్కాలర్షిప్ (డే స్కాలర్లకు రూ.3500, హాస్టలర్లకు రూ.4500) అందేలా ఎంఈఓలు నవంబర్ 10లోపు వివరాలు పంపాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అశ్వారావుపేట వార్డెన్‌ను సస్పెండ్ చేశారు.


Quthbullapur: ఫాక్స్‌సాగర్ చెరువులో హైడ్రా కొరడా: ఆక్రమణల తొలగింపు!
కుత్బుల్లాపూర్ ఫాక్స్‌సాగర్ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపించింది. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్ ప్రహరీతో పాటు అర కి.మీ బండ్, జీడిమెట్లలోని 20 ఎకరాల ప్రహరీలను కూల్చివేసింది. ఎఫ్టీఎల్ పరిధిని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.


Vikarabad: ఆపదలో ఉన్న రైతుకు అండగా చైతన్య కిరణ్ మల్కాపురం
Vikarabad: వ్యవసాయ నష్టాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి వికారాబాద్ మిషన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బంట్వారం మండలం రొంపల్లి రైతు రాజును బీఆర్ఎస్ నాయకుడు చైతన్య కిరణ్ మల్కాపురం పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరి, కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి ధైర్యం చెప్పారు.


Sadashivunipalem: రోడ్డుపై ధాన్యం ఆరబోత: బైకర్ మృతి, కేసు నమోదు
Sadashivunipalem: సదాశివునిపాలెంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పను ఢీకొని రాంబాబు మృతి చెందగా, ధాన్యం యజమానులు ఇద్దరిపై సత్తుపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.