

Sircilla: ఆలయాల అభివృద్ధికి నిధులు త్వరగా మంజూరు చేయాలి: ఏపీ మంత్రికి బీఆర్ఎస్ వినతి
సిరిసిల్ల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.7 కోట్లు, ఎల్లారెడ్డిపేట వేణుగోపాల స్వామి ఆలయానికి రూ.6 కోట్ల టీటీడీ నిధులను త్వరగా విడుదల చేయాలని కేటీఆర్ ఆదేశాల మేరకు ఏపీ దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు విజయవాడలో వినతిపత్రం అందజేశారు.


Jagtial: చెరువుల పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలి: ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల పట్టణంలోని చింతకుంట, మోతె చెరువుల సుందరీకరణ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశించారు. కాంట్రాక్టర్ 2 రోజుల్లో చింతకుంట పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రూ.3 కోట్లతో మోతె చెరువును తీర్చిదిద్దుతున్నామని, పనుల్లో నాణ్యత పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు.


Banswada: ఆయుష్ ఆసుపత్రి మెగా హెల్త్ క్యాంప్ కరపత్రాలు ఆవిష్కరించిన పోచారం
ఆయుష్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఆయుష్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఎస్. స్వేత ఆధ్వర్యంలో, తేదీలు 14 11 2026 మరియు 15 11 2026 న నిర్వహించనున్న రెండు రోజుల మెగా మాస్టర్ హెల్త్ క్యాంప్ కరపత్రాలను మాజీ శాసనసభాపతి, ముఖ్య వ్యవసాయ సలహాదారులు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు.


Jagtial: మెట్‌పల్లి వద్ద దారుణ రోడ్డు ప్రమాదం
జగిత్యాల జిల్లాలో దారుణ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెట్టుపల్లి పట్టణంలోని అరపేట శివారులో వేగంగా వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి సమీపంలో ప్రమాదం జరిగింది. మేడిపల్లి మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మెట్టుపల్లి పట్టణంలోని రేగుంటలో జరుగుతున్న ఒక శుభకార్యానికి ఆటోలో బయలుదేరారు.


Proddatur: ప్రొద్దుటూరు అభివృద్ధికి నిధులివ్వండి: సీఎంకు ఎమ్మెల్యే వినతి!
ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అమరావతిలో సీఎం చంద్రబాబును కోరారు. కొనసాగుతున్న పనుల వివరాలు, తాజా రాజకీయాలపై చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ యువనేత కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, పలువురు నేతలు పాల్గొన్నారు.


Narayanpet: బాధితుల వద్దకే వెళ్లి ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్: ఎస్పీ డా. వినీత్
నారాయణపేట జిల్లాలో పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఉన్న బాధితులు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల వద్దకే వెళ్లి ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. ఫోన్ సమాచారం రాగానే సంఘటనా స్థలానికి చేరుకోవాలని, బాధితుల గోప్యతను కాపాడుతూ తక్షణ న్యాయం అందించాలన్నారు.


Nirmal: చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలన క్షుణ్ణంగా జరపాలి
చేయూత పింఛను దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ క్షుణ్ణంగా జరగాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ చేయూత పింఛను దరఖాస్తుల పరిశీలన ప్రక్రియపై ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పింఛను దరఖాస్తుల వివరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. అర్హులందరికీ పింఛన్ వచ్చేలా చూడాలని అన్నారు.


Gajuwaka: తప్పిపోయిన వృద్ధుడిని కుటుంబానికి అప్పగించిన పోలీసులు!
గాజువాక జింక్ సీఎస్ఎఫ్ గ్రౌండ్‌లో నీరసంతో పడివున్న 80 ఏళ్ల వృద్ధుడు కోటిపల్లి నూకయ్యను బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ కళ్యాణ్ రక్షించారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆచూకీ గుర్తించి కుమారుడు రమేష్‌కు క్షేమంగా అప్పగించారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు వెల్లువెత్తాయి.


Armoor: 42 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్.. 90 గంటల దాపరికంపై అనుమానాలు
ఆర్మూర్ నియోజవర్గానికి ఆలస్యంగా వెలుగులో వచ్చిన ఘటన, పట్టణంలోని వివిధ ప్రాంతంలో పేకాట ఆదివారం రోజున రాత్రి ఆడుతున్న 42 మందిని పట్టుకున్నట్టు పట్టణ SHO చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.


Eluru: ఏలూరు జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్!
ఏలూరు జిల్లాలోని 544 పంచాయతీలు, 5,696 వార్డులకు నవంబర్ 15 నుండి డిసెంబర్ 3 వరకు 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. నవంబర్ 26, 29, డిసెంబర్ 2న పోలింగ్ మరియు ఫలితాలు ఉంటాయి. 5,821 కేంద్రాల్లో సీసీ నిఘాతో పటిష్ట భద్రత మధ్య ఎన్నికలు జరుపుతామన్నారు.


Jagtial: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి వారిని సినీ నటుడు మేకా శ్రీకాంత్ మంగళవారం దర్శించుకున్నారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన శ్రీకాంత్‌కు అర్చకులు ఘనంగా స్వాగతం పలికి, ఆయన గోత్రనామాలతో పూజలు జరిపి వేదాశీర్వచనం అందించారు.


Sircilla: సిరిసిల్ల 35వ వార్డు పద్మశాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు
సిరిసిల్ల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 35వ వార్డు నూతన కమిటీని నియమించారు. అధ్యక్షుడిగా గజ్జలి శ్రీధర్, ఉపాధ్యక్షులుగా ఉడత రమేష్, ఆడెపు సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా నక్క మల్లేశం ఎన్నికయ్యారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ సభ్యులుగా చేర్చి సమాజ ఐక్యత, సంక్షేమానికి కృషి చేస్తామని నేతలు తెలిపారు. పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.