జగన్
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 151 సీట్లను గెలుచుకుంది. ఒక్కడితో ప్రారంభమైన వైకాపా నేడు ప్రభంజనంలా మారింది.
5 ఏళ్లు అధికారంలో ఉన్న టీడీపీ.. 23 అసెంబ్లీ, 3 లోకసభ స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా జగన్ గుర్తింపు తెచ్చుకున్నారు.
వైఎస్అర్ మరణాంతరం జగన్ ఓదార్పు యాత్ర చేపట్టగా కాంగ్రెస్ హైకమాండ్ అడ్డుపడింది. తన తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జగన్ వైసీపీని స్థాపించారు.
టీడీపీ పాలనలో ప్రజాసమస్యలపై ఉద్యమిస్తూ 2017 నవంబర్ 6న ప్రజా సంకల్పయాత్ర చేపట్టిన జగన్. 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో జనంతో మమేకం అయ్యారు.
2019 ఎన్నికల్లో ఒంటి చేత్తో వైసీపీని గెలిపించిన జగన్ 2019 మే 30న సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరు నెలల్లో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన వాగ్దానాల్లో 80 శాతం నెరవేర్చారు.