బ్లాక్ ఫంగస్ తరహాలోనే కరోనా రోగులపై దాడిచేస్తుంది వైట్ ఫంగస్. దీని అసలు పేరు కాండిడా అల్బికాన్స్. బీహార్లో ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి.
ఎందుకు సోకుతుంది?
కరోనాకు స్టెరాయిడ్లు అతిగా వాడడంతో.. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే షుగర్ లెవల్స్ తీవ్రంగా పెరిగినప్పుడు వైట్ ఫంగస్ దాడి చేస్తుంది. వైట్ ఫంగస్ పెరుగుదలను త్వరగా అడ్డుకోకపోతే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.
దేనిపై ప్రభావం చూపుతుంది?
వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతో పాటు కడుపు, పేగులు, కిడ్నీలు, చర్మం, గోర్లు, జననేంద్రియాలకు సోకుతుంది. మహిళలు, చిన్న పిల్లల్లోనూ ఇది ప్రభావం చూపించడం ఆదోళనకరంగా మారింది.
లక్షణాలు?
నోటిలో, గొంతులో, నాలికపై కురుపులు, తెల్లని మచ్చలు ఏర్పడుతాయి. సైనస్ వాపు, గొంతునొప్పి ఉంటుంది. తీవ్రంగా ఆయాసం, శక్తిని కొల్పోయేలా చేస్తుంది.
లక్షణాలు?
జననేంద్రియాలు, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి. ఈ లక్షణాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
లక్షణాలు?
పేగులకు ఫంగస్ ఇన్ఫెక్ట్ అయితే మలబద్ధకం, గ్యాస్, డయేరియా లక్షణాలు ఉంటాయి. బాహుమూలాలు, మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల చర్మంపై దద్దుర్లు వస్తాయి. కీళ్లనొప్పులు తలెత్తుతాయి.
బయట పడేది ఎలా?
వైట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీ ఫంగల్ ఔషధాలు, ఇంజెక్షన్లు వాడాల్సి ఉంటుంది. అదే సమయంలో తగిన పోషకాహారం తీసుకోవడం, వీలైనంత వరకు తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.