అవతలి వ్యక్తి వద్దు అని చెప్పినా పదే పదే మెసేజ్‌లు పంపితే మీ అకౌంట్ పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

బల్క్ మెసేజింగ్ ప్రమాదం:
ఒకేసారి వేలాది మందికి ఆటోమేటెడ్ లేదా బల్క్ మెసేజ్‌లు పంపడం వాట్సాప్ నిబంధనలకు విరుద్ధం.
అనధికారిక యాప్స్ వాడకం:
వాట్సాప్‌ను పోలిన జీబీ వాట్సాప్ వంటి థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగిస్తే అకౌంట్ వెంటనే బ్లాక్ అవుతుంది.
నెంబర్ల దుర్వినియోగం:
ఎవరి అనుమతి లేకుండా వారి ఫోన్ నెంబర్లను ఇతరులతో షేర్ చేయడం లేదా గ్రూపుల్లో కలపడం నిషేధం.
బ్రాడ్ కాస్ట్ లిమిట్స్:
బ్రాడ్ కాస్ట్ ఫీచర్‌ను అతిగా ఉపయోగించి పదే పదే మెసేజ్‌లు పంపిస్తే స్పామ్‌గా గుర్తించి చర్యలు తీసుకుంటారు.
వ్యక్తిగత సమాచారం సేకరణ:
ఇతర యూజర్ల ప్రొఫైల్ ఫోటోలు, స్టేటస్‌లు, నెంబర్లను ఆటోమేటెడ్ పద్ధతిలో సేకరించడం నేరం.
ఫేక్ న్యూస్ ప్రచారం:
తప్పుడు వార్తలు, పుకార్లు లేదా సమాజాన్ని తప్పుదోవ పట్టించే విషయాలను ఫార్వర్డ్ చేయడం చేయకూడదు.
వేధింపులు, బెదిరింపులు:
చాటింగ్‌లో ఎవరినైనా బెదిరించడం, అసభ్యంగా ప్రవర్తించడం లేదా హేట్ స్పీచ్‌ను వాట్సాప్ అస్సలు సహించదు.
యూజర్ రిపోర్ట్స్:
పదే పదే ఇతర యూజర్లు మీ అకౌంట్‌ను రిపోర్ట్ చేస్తే మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ ద్వారా అకౌంట్ బ్యాన్ అవుతుంది.
టర్మ్స్ ఆఫ్ సర్వీస్ ఉల్లంఘన:
వాట్సాప్ నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను తుచా తప్పకుండా పాటించడం ఎంతో ముఖ్యం.