క్యాచీ అంటే ఏమిటి? :

క్యాచీ అనేది ఫోన్ లేదా యాప్‌లు భద్రపరిచే ఒక టెంపరరీ మెమరీ లేదా డేటా.
ప్రధాన ఉద్దేశం:
మనం తరచుగా వాడే యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు త్వరగా ఓపెన్ అయ్యేలా సహాయపడటమే క్యాచీ ప్రధాన ఉద్దేశం.
సమయం ఆదా అవుతుంది :
ఒకసారి లోడ్ అయిన ఫోటోలు, వీడియోలు లేదా ఇమేజ్‌లు మళ్లీ మొదటి నుంచి డౌన్‌లోడ్ కాకుండా క్యాచీ ద్వారా వేగంగా ఓపెన్ అవుతాయి.
స్టోరేజ్ సమస్య :
కాలక్రమేణా ఈ క్యాచీ డేటా విపరీతంగా పెరిగిపోయి ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఎక్కువగా ఆక్రమించేస్తుంది.
యాప్స్ క్రాష్ అవ్వడం :
కొన్ని సందర్భాల్లో పాత లేదా కరప్ట్ అయిన క్యాచీ డేటా వల్ల యాప్‌లు సరిగ్గా పనిచేయక మధ్యలోనే ఆగిపోవడం లేదా క్రాష్ అవ్వడం జరుగుతుంది.
ఫోన్ స్లో అవ్వడం :
స్టోరేజ్ నిండిపోవడం వల్ల ఫోన్ పనితీరు మందగించి, హ్యాంగ్ అయ్యే సమస్యలు ఎదురవుతాయి.
ఎప్పుడు క్లియర్ చేయాలి? :
ఫోన్‌లో స్టోరేజ్ తగ్గిపోయినా, ఏదైనా యాప్ తరచూ ఇబ్బంది పెడుతున్నా లేదా మొబైల్ స్లో అయినప్పుడు క్యాచీ క్లియర్ చేయడం మంచిది.
రోజూ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు :
క్యాచీ‌ను ప్రతిరోజూ లేదా పదే పదే డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు క్లియర్ చేస్తే సరిపోతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్లలో క్లియర్ చేయడం ఎలా :
ఆండ్రాయిడ్ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, 'Apps' సెక్షన్‌లో మీకు కావలసిన యాప్‌ను ఎంచుకుని, 'Storage' పై క్లిక్ చేసి 'Clear Cache' ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి.
తాత్కాలిక ప్రయోజనం :
క్యాచీ‌ను క్లియర్ చేయడం వల్ల స్టోరేజ్ తాత్కాలికంగా ఖాళీ అవుతుంది. అయితే మీరు మళ్లీ యాప్‌లు వాడేకొద్దీ కొత్త క్యాచీ డేటా ఆటోమేటిక్‌గా తయారవుతుంది.