ఈ మధ్యకాలంలో బుల్లెట్ కాఫీ పేరిట ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. కాఫీలో నెయ్యి కలుపుకుని తాగితే పొట్ట కొవ్వు కరిగిపోతుందని కీటో డైట్ నిపుణులు చెబుతున్నారు
కీటో డైట్ అనేది ఎక్కువగా కొవ్వు సంబంధిత ఫుడ్ తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు కలిగించవచ్చని చెబుతూ ఉంటారు. అందులో భాగమే ఈ బుల్లెట్ కాఫీ
వజ్రాన్ని వజ్రం తోనే కట్ చేయాలి అనేది ఒక సామెత అలాగే కొవ్వును కొవ్వుతోనే కట్ చేయాలనేది కీటో డైట్ సారాంశం
బుల్లెట్ కాఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ గా మారింది. గతంలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా తన యూట్యూబ్ ఛానల్ లో ఈ బుల్లెట్ కాఫీ గురించి చెప్పారు.
బుల్లెట్ కాఫీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయం లేవగానే ఒక కప్పు బ్లాక్ కాఫీ డికాషన్ లో రెండు స్పూన్ల శుద్ధమైన ఆవు నెయ్యిని కలిపి తాగాల్సి ఉంటుంది.
ఇలా తాగడం వల్ల మీ శరీరంలో ఉన్న లివర్ లోని టాక్సిన్ లను తొలగించుకోవచ్చు. అలాగే ఆవు నెయ్యిలోని ఫ్యాటీ యాసిడ్లు మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించేందుకు ఉపయోగపడతాయి.
బ్లాక్ కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వు కరిగించేందుకు ఎక్కువగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా శరీరంలోని మెటబాలిజంను పెంచడం ద్వారా కొవ్వు కరిగేందుకు దోహదం చేస్తుంది.
బుల్లెట్ కాఫీ ప్రస్తుతం కీటో డైట్ పాటించేవారు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల బరువు తగ్గుతుందని భావిస్తారు.
బుల్లెట్ కాఫీ తో పాటు చాలామంది ఉదయం లేవగానే కొబ్బరి నూనె తాగడం అనేది చూస్తూ ఉంటాం. దీని వల్ల కూడా శరీరంలో కొవ్వును కరిగించుకోవచ్చని కీటో డైట్ నిపుణులు చెబుతుంటారు.
ఇదిలా ఉంటే పైన పేర్కొన్న సమాచారం శాస్త్రీయబద్ధమైనది కాదు. మీరు ఎలాంటి ఆరోగ్య సూచనలు కావాలనుకున్న సర్టిఫైడ్ డాక్టర్ల వద్దనే పొందగలరు.