గుండెలో మంట, ఎసిడిటీని పెంచే ఫుడ్స్ ఇవే

మసాలా ఫుడ్స్
కారంగా ఉండే ఆహారాలు అన్నవాహికలో చికాకుపరుస్తాయి. గుండెల్లో మంట, ఎసిడిటీ పెంచుతాయి.
సిట్రస్ పండ్లు
నారింజ, ద్రాక్ష, నిమ్మ జాతికి చెందిన పండ్లలో సిట్రస్ ఆమ్లం ఉంటుంది. ఇది గుండెల్లో మంటను ప్రేరేపిస్తుంది.
టమోటోలు
టమోటోలతో తయారు చేసిన, సల్సా, మారినారా సాస్ వంటి ఫుడ్స్ ఆమ్లత్వం కలిగి ఉంటాయి. ఇవి తింటే గుండెలో మంట వస్తుంది.
చాక్లెట్
చాక్లెట్ లో కోకూ, కెఫిన్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి ఎసోఫాగియల్ ఎక్స్ పోజర్ యాసిడ్స్ ను పెంచుతాయి.
ఆల్కహాల్
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. ఇది తాగుతే గుండెల్లో మంటకు కారణం అవుతుంది.
కెఫీన్
కెఫీన్ ఉండే కాఫీ, టీ వంటివి తీసుకోకూడదు. ఇవి అసిడిటీ, గుండెలో మంటను పెంచుతాయి.
స్వీటెనర్స్
స్వీటెనర్స్ కూడా ఎసిడిటీ, గుండెలో మంటను పెంచుతాయి. బరువు పెరిగే సమస్య కూడా పెరుగుతుంది.