లెమన్ ఇంఫ్యూజ్డ్ వాటర్ తాగడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే రుచి కూడా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం..
1. హైడ్రేషన్ ఇస్తుంది
హైడ్రేషన్ కి మంచి సోర్స్ నీరు. కానీ, కొంత మందికి నార్మల్ వాటర్ బోరింగ్ గా అనిపిస్తుంది. నిమ్మకాయ యాడ్ చేయడం వల్ల నీటికి మంచి రుచి వస్తుంది. దాంతో ఎక్కువ నీరు తాగుతారు.
2. విటమిన్ సీ
సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సీ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్, ఇది ఫ్రీ ర్యాడికల్స్ జరిపే డ్యామేజ్ నుండి కణాలను రక్షిస్తుంది. బ్లడ్ ప్రెజర్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్, స్ట్రోక్ వచ్చే రిస్క్ ని కూడా తగ్గిస్తుంది.
3. వెయిట్ లాస్
నిమ్మకాయల్లో ఉండే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ బరువు పెరగడాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
4. స్కిన్ క్వాలిటీ
నిమ్మకాయ లో ఉండే విటమిన్ సీ చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. పొడి చర్మం రానీయకుండా, సన్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది.
5. అరుగుదలకి సహకరిస్తుంది
కాన్స్టిపేషన్ రాకుండా చాలామంది పొద్దున్నే నిమ్మ రసం తాగుతారు. ఇది డైజెస్టివ్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. తిన్న ఆహారాన్ని పూర్తిగా అరుగుతుంది.
6. నోరు ఫ్రెష్ గా
ఉల్లి, వెల్లుల్లి, చేపలు లాంటివి తిన్న తరువాత నోరు ఒకలాంటి వాసన వస్తుంది. ఇలా రాకుండా ఉండాలంటే భోజనం తరువాత ఒక గ్లాసు లెమన్ వాటర్ తాగితే సరిపోతుంది.
7. కిడ్నీ స్టోన్స్ రాకుండా
నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ రాకుండా చూస్తుంది. సిట్రిక్ యాసిడ్ లో ఉండే సిట్రేట్ యూరిన్ యొక్క ఎసిడిటీని తగ్గిస్తుంది. చిన్న చిన్న స్టోన్స్ ని కరిగిస్తుంది.