రోజుకో అరటిపండు తింటే ఎన్ని లాభాలో

అరటిపండ్లు
అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ అరటి పండు తింటే కలిగే ప్రయోజనాలు చూద్దాం.
పొటాషియం
అరటిపండ్లలో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండె, కండరాల పనితీరుకు సహయపడుతుంది.
రక్తపోటు
రోజుకో అరటిపండు తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
డైటరీ ఫైబర్
అరటిపండ్లలో డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాపడుతుంది. కరికే ఫైబర్, పెక్టిన్ జీర్ణవ్యవస్థను సజావుగా ఉంచుతుంది. గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
సహజ శక్తి
అరటిపండ్లలో కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా సహజమైనశక్తిని అందిస్తుంది. ఇందులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సాధారణ చక్కెరలు ఉంటాయి.
మానసిక స్థితి
అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది శరీరంలో సెరోటోనిన్ గా మారుతుంది. ఒత్తిడి, నిరాశ, ఆందోళన వంటి లక్షణాలను తగ్గిస్తుంది.
గుండెకు మేలు
అరటిలోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు గుండెకు మేలు చేస్తాయి. ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
ఎముకల ఆరోగ్యానికి
అరటిపండ్లు ఎముకల ఆరోగ్యానికి కీలకమైనవి. విటమిన్ సి, మాంగనీస్ తో సహాఅవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎముకల బలానికి సహాయపడతాయి.
షుగర్ పేషంట్లకు
అరటిపండ్లలోని పీచు, ముఖ్యంగా పెక్టిన్ రక్తప్రవాహంలోకి చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది.