వెంటనే ఛార్జర్ పెట్టకండి:

ఫోన్ నీటిలో తడిచిన వెంటనే ఛార్జింగ్ కేబుల్ అస్సలు కనెక్ట్ చేయవద్దు. ఇది షార్ట్ సర్క్యూట్‌కు దారితీస్తుంది.
ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి:
నీటి నుంచి బయటకు తీసిన వెంటనే ఫోన్‌ను వెంటనే పవర్ ఆఫ్ చేయడం అత్యంత ముఖ్యం.
కవర్, సిమ్ తొలగించండి:
ఫోన్ బ్యాక్ కవర్, సిమ్ కార్డ్, మెమరీ కార్డ్ వంటి వాటిని వెంటనే వేరు చేసి బయట పెట్టాలి.
ఫోన్‌ను కుదిలించవద్దు:
నీరు బయటకు వస్తుందనే ఉద్దేశంతో ఫోన్‌ను గట్టిగా కుదిలించడం లేదా జాడించడం చేయకూడదు. దీనివల్ల నీరు మరింత లోపలికి వెళ్తుంది.
మదర్‌బోర్డుకు ముప్పు:
లోపలి ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లోకి తేమ చేరితే మదర్‌బోర్డు, బ్యాటరీ శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
బియ్యంలో పెట్టడంపై అప్రమత్తత:
ఫోన్‌ను బియ్యంలో పెట్టే పద్ధతి పాతదే అయినప్పటికీ, బియ్యం చిన్న రంధ్రాల్లో ఇరుక్కునే అవకాశం ఉంది.
హైర్ డ్రైయర్ వాడకండి:
ఫోన్‌ను త్వరగా ఆరబెట్టాలనే ఉద్దేశంతో హెయిర్ డ్రైయర్ ద్వారా వేడి గాలిని తగిలించకూడదు. ఈ వేడి స్క్రీన్, బ్యాటరీని పాడుచేస్తుంది.
ఎండలో పెట్టవద్దు:
నేరుగా సూర్యరశ్మి లేదా తీవ్రమైన ఎండలో ఫోన్‌ను ఉంచడం వల్ల బ్యాటరీ పేలే అవకాశం ఉంటుంది.
24 గంటల సమయం ఇవ్వండి:
ఫోన్‌ను ఎలాంటి గందరగోళానికి గురిచేయకుండా కనీసం 24 నుంచి 48 గంటల పాటు పొడి గది ఉష్ణోగ్రతలో గాలి తగిలేలా ఉంచాలి.
సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి:
అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫోన్ ఆన్ కాకపోతే, సొంతంగా రిపేర్ చేయడానికి ప్రయత్నించకుండా అధీకృత సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లడం మంచిది.