ప్రోటీన్ పవర్ హౌస్ :

ఒక పెద్ద ఉడికించిన గుడ్డులో సుమారు 6 గ్రాముల నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది, ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
రోజుకు ఎన్ని తినాలి? :
బరువు తగ్గడానికి నార్మల్ డైట్ పాటించే ఒక సాధారణ వ్యక్తి రోజుకు ఒకటి నుండి రెండు గుడ్లను నిరభ్యంతరంగా తినవచ్చు.
జిమ్‌కు వెళ్లేవారికి :
ఒకవేళ మీరు జిమ్‌కు వెళ్తూ లేదా తీవ్రమైన వ్యాయామాలు చేస్తుంటే.. మీ శరీర అవసరాలకు తగినట్లుగా మరికొన్ని ఎక్కువ గుడ్లు తినవచ్చు.
ఆకలికి చెక్ :
ప్రోటీన్ అధికంగా ఉండే గుడ్లను తినడం వల్ల, శరీరంలో ఆకలిని కలిగించే గ్రెలిన్ అనే హార్మోన్ స్థాయిలు తగ్గి, అతిగా తినడాన్ని నివారిస్తుంది.
పచ్చసొన తినొచ్చా? :
బరువు తగ్గాలనుకునే వారు గుడ్డు సొనను పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేదు. అందులో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి.
కీలక పోషకాలు :
గుడ్డు పచ్చసొనలో మెదడు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ, డి, ఇ, బి12 లతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, కోలిన్ వంటి కీలక పోషకాలు లభిస్తాయి.
కొలెస్ట్రాల్ భయాలు వద్దు :
మనం తినే ఆహారంలోని కొలెస్ట్రాల్, మన రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అంత త్వరగా ప్రభావితం చేయదని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ఆరోగ్య సమస్యలు ఉంటే :
మీకు ఇప్పటికే అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు వంటి సమస్యలు ఉంటే మాత్రం, మీ డాక్టర్ సూచనల ప్రకారమే పచ్చసొన పరిమాణాన్ని తగ్గించుకోవాలి.
ఉడికించిన గుడ్లే బెస్ట్ :
బరువు తగ్గాలనుకునే వారు ఉదయం అల్పాహారంతో పాటు ఉడికించిన గుడ్లు తినడం అత్యంత ఉత్తమమైన పద్ధతి.
ఆమ్లెట్ వేసేటప్పుడు జాగ్రత్త :
ఆమ్లెట్ తినాలనుకుంటే నాన్ స్టిక్ పాన్‌పై కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె మాత్రమే వాడండి. ఎక్కువ నూనె వాడితే బరువు తగ్గడం కష్టమవుతుంది.