T20ల్లో 6 రికార్డులు క్రియేట్ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
3,000 పరుగులు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ 20 ల్లో 3,000 పరుగులు పూర్తి చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
హాఫ్ సెంచరీలలో...
టీ 20ల్లో విరాట్ కోహ్లీ 26 హాఫ్ సెంచరీలతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. రోహిత్ శర్మ (25), డేవిడ్ వార్నర్ (19) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
ఇండియా తరపున రికార్డు
2010 లో భారత్ తరఫున టీ 20 ల్లో ఆరంగేట్రం చేసిన కోహ్లీ, డక్ అవుట్ కాకుండా 47 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇండియన్ క్రికెట్ లో డక్ అవుట్ (తన మొదటి డక్ అవుట్ కి ముందు)కాకుండా ఎక్కువ ఇన్సింగ్స్ లు ఆడిన వాడిలో ఫస్ట్ గా నిలిచాడు. ఓవరాల్ గా జింబాబ్వే ప్లేయర్ హామిల్టన్ మసకాడ్జా (61 ఇన్నింగ్స్) ఫస్ట్ ఉన్నాడు.
టీ 20 లలో ఎక్కువ ఫోర్లు (4s)
కోహ్లీ 81 ఇన్నింగ్స్‌లలో 270 ఫోర్లు కొట్టి మొదటి స్థానంలో నిలిచాడు. ఆ తరువాత ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టెర్లింగ్ (251 ఫోర్లు), న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గుప్టిల్ (250 ఫోర్లు) ఉన్నారు.
వేగంగా 1,000 పరుగులు
భారత బ్యాట్స్‌మెన్స్‌లో కోహ్లీ టీ 20 లో కేవలం 27 ఇన్నింగ్స్‌లలో 1,000 పరుగులు పూర్తి చేసి, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇంటర్నేషనల్‌లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజం 26 ఇన్నింగ్స్ లో కంప్లీట్ చేశాడు.
వేగంగా 2,000 పరుగులు
పొట్టి క్రికెట్లో 2,000 పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి 56 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. ఆ తరువాత ఆరోన్ ఫించ్ (62 ఇన్నింగ్స్), బ్రెండన్ మెకల్లమ్ (66 ఇన్నింగ్స్) ఉన్నారు.