నిజానికి మూత్రంలో యూరోక్రోమ్ అనే రసాయనం ఉంటుంది. అది ఒక పసుపు వర్ణద్రవ్యం. దీని కారణంగా మూత్రం రంగు పసుపు రంగులో కనిపిస్తుంది.
కొన్నిసార్లు మందులు వాడటం వల్ల కూడా మూత్రం రంగు మారుతుంది.
మూత్రం సాధారణ రంగులో కనిపించినప్పుడు మీరు ఎక్కువ నీరు త్రాగుతున్నారని అర్థం.
హైడ్రేటెడ్‌గా ఉండటం మంచి విషయమే కానీ ఎక్కువ నీరు తాగడం వల్ల మీ శరీరంలోని ఎలక్ట్రోలైట్లు తగ్గుతాయి.
మీ మూత్రం రంగు ఎల్లప్పుడూ పారదర్శకంగా కనిపిస్తే మీరు తక్కువ నీరు తాగాలని అని సంకేతం.
శరీరంలో హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం కావడం వల్ల కూడా యూరోక్రోమ్ ఏర్పడుతుంది. రక్తంలో విటమిన్-డి ఎక్కువగా ఉండటం వల్ల కొన్నిసార్లు మూత్రం ముదురు పసుపు రంగులో కనిపిస్తుంది.
మూత్రం ఎరుపు, గులాబీ రంగులో ఉన్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మీరు తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ చాలా రోజులు ఇదే కలర్లో కొనసాగితే అప్పుడు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే మూత్రం రంగు అనేక వ్యాధుల వల్ల మారుతుంది.
ప్రోస్టేట్, కిడ్నీ స్టోన్, మూత్రాశయం లేదా కిడ్నీలో కణితి మొదలైన వాటివల్ల మూత్రం రంగులో మార్పులు ఉంటాయి.