నారప్పలో వెంకటేశ్‌ ప్రేయసిగా కనిపించే ఈ హీరోయిన్ అసలు పేరు అమ్ము అభిరామి
చెన్నైలో పుట్టి పెరిగిన ఆమె చదువుకునే రోజుల్లో నుంచే సినిమాల్లో నటించింది.
నారప్ప ఒరిజినల్ వెర్షన్ ధనుశ్ ‘అసురన్’లో కూడా అదే పాత్రను చేసి మంచి మార్కులే కొట్టేసింది అమ్ము అభిరామి.
ఇండస్ట్రీకి వచ్చిన నాలుగేళ్లలోనే విష్ణు విశాల్, కాశీ వెంకట్, విక్రమ్ ప్రభు, బాలా శరవణన్, ఆర్జే షా వంటి ప్రసిద్ద నటులతో ఆమె నటించింది.
ఈమె తెలుగులో మొదటి సారి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ సినిమాలో కనిపించింది.
జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ఎఫ్‌సీయూకే(ఫాదర్‌ ఆఫ్‌ చిట్టి ఉమా కార్తీక్‌)లోనూ ఉమా అనే పాత్రలో కనిపించింది.