పోషకవిలువలున్న ఆహరం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. ముఖ్యమైన పదిరకాల ఆహార పదార్ధాలలోని పోషక విలువలు ఈ ఫోటో స్టోరీ లో తెలుసుకుందాం!
బ్రెజిల్ నట్స్
బ్రెజిల్ నట్స్ లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, మెగ్నీషియం, జింక్, విటమిన్స్ బీ1, ఈ ఉంటాయి. ఇందులో ఉండే సెలీనియం థరిరాయిడ్ ఫంక్షన్ ని మెయింటెయిన్ చేయడంలో సాయం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఎక్కువే.
ఓట్స్
ఓట్స్ లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి, కార్డియో వాస్క్యులర్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ కూడా గణనీయం గా తగ్గుతుంది. ఇందులో ఉండే కాంప్లెక్స్ కార్బ్స్ వల్ల నెమ్మదిగా అరుగుతాయి. ఇందు వల్ల బ్లడ్ గ్లూకోజ్ స్టేబుల్ గా ఉంటుంది.
వీట్ జెర్మ్
వీట్ జెర్మ్ లో ఫైబర్, విటమిన్ ఈ, ఫోలిక్ యాసిడ్, థయామిన్, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఎస్సెన్షియల్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉన్నాయి. ఇవి హోల్ గ్రెయిన్ లో లభిస్తాయి.
ఆల్మండ్స్
ఆల్మండ్స్ లో మెగ్నీషియం, విటమిన్ ఈ, ఐరన్, కాల్షియం, ఫైబర్, రైబోఫ్లావిన్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించగలవని కూడా తెలుస్తోంది.
చిలగడ దుంపలు
చిలగడ దుంపల్లో డైటరీ ఫైబర్, విటమిన్స్ ఏ, సీ, బీ6, పొటాషియం ఉంటాయి. ఇంకా, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ కూడా ఉంటాయి.
చేపలు
సాల్మన్, ట్రౌట్, మాకరెల్, సార్డీన్స్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ హై లెవెల్స్ లో ఉంటాయి. ఇవి ఆర్థ్రైటిస్ వంటి హెల్త్ కండిషన్స్ లో ఎంతో హెల్ప్ చేస్తాయి. విటమిన్స్ ఏ, డీ కూడా ఈ ఫిష్ లో ఎక్కువే.
చికెన్
చికెన్ ని హెల్దీ మీల్ అని చెప్పుకోవచ్చు. అయితే, చికెన్ ని ఎలా వండారన్న దాని మీద చికెన్ యొక్క న్యూట్రియెంట్స్ అందడం ఆధారపడి ఉంటుంది. డీప్ ఫ్రైడ్ చికెన్ ని కొద్ది మోతాదు లోనే తీసుకోవాలి. అలాగే, తినే ముందు స్కిన్ తీసేసి తినాలి.
ఎగ్స్
ఎగ్స్ లో విటమిన్స్ బీ2, బీ12 ఉంటాయి. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ జెనరేట్ అవ్వడానికీ, ఎనర్జీ ప్రిజర్వేషన్ కీ ఎంతో అవసరం. అయితే, డయాబెటీస్, కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ ఉన్న వారు డాక్టర్ కన్సల్టేషన్ తరువాతే ఎగ్స్ ని తీసుకోవడం మంచిది.
పప్పులు
పప్పుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం కూడా ఉంటాయి. ప్రోటీన్ కూడా ఎక్కువే.
ఆకుకూరలు
ఆకుకూరలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ వచ్చే రిస్క్ ని బాగా తగ్గిస్తాయి. వీటిద్వారా విటమిన్ ఎ బాగా లభిస్తుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.