బుమ్రా నుంచి కుంబ్లే వరకు.. అంతర్జాతీయ క్రికెట్‌లో టాప్ 10 భారత బౌలర్లు వీరే..
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 భారత బౌలర్ల జాబితాలోకి టీమిండియా యార్కర్ కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంట్రీ ఇచ్చాడు. ఈ పేసర్ కంటే ముందు ఎవరున్నారో ఓసారి చూద్దాం..
ఈ లిస్టులో టీమిండియా మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో నిలిచాడు. అతని పేరుతో 953 వికెట్లు ఉన్నాయి.
ఈ లిస్టులో రెండో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఈ టీమిండియా ఆల్ రౌండర్ తన ఖాతాలో 744 వికెట్లు వేసుకున్నాడు.
టీమిండియా టర్బేనేటర్ హర్భజన్ సింగ్ ఖాతాలో 707 వికెట్లు చేరాయి. దీంతో ఈ లిస్టులో మూడో స్థానంలో నిలిచాడు.
ఇక ప్రపంచ కప్ అందించిన తొలి కెప్టెన్, టీమిండియా ఆల్ రౌండర్ కపిల్ దేవ్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. మొత్తం 687 వికెట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు
ఈ లిస్టులో టీమిండియా మరో పేసర్ జహీర్ ఖాన్ ఐదో స్థానంలో నిలిచాడు. జహీర్ ఖాతాలో 597 వికెట్లు ఉన్నాయి.
అలాగే, టీమిండియా మరో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 570 వికెట్లతో ఈ లిస్టులో ఆరో స్థానంలో నిలిచాడు.
టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ పేరుతో 551 వికెట్లు ఉన్నాయి. ఈ లిస్టులో శ్రీనాథ్ ఏడో స్థానంలో నిలిచాడు.
టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ పేరుతో 551 వికెట్లు ఉన్నాయి. ఈ లిస్టులో శ్రీనాథ్ ఏడో స్థానంలో నిలిచాడు.
ఇషాంత్ శర్మ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఈ బౌలర్ ఖాతాలో మొత్తం 434 వికెట్లు ఉన్నాయి.
యార్కర్ కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా మొత్తం 400* వికెట్లతో ఈ లిస్టులో పదవ స్థానంలో నిలిచాడు.