రేపటి నుంచి రోడ్డెక్కనున్న విజయవాడ సిటీ బస్సులు

కరోనా నేపథ్యంలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు 60 శాతం ప్రయాణికులతో రేపటి నుంచి రోడ్డు ఎక్కనున్నాయి.. 26 వరకు కొద్ది సంఖ్యలో తరువాత ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా బస్సు సర్వీసులు నడుపుతారు.
మాస్క్ ల తో ఫ్యాషన్ షోలో మోడల్స్
లండన్‌లో నిర్వహించిన స్ప్రింగ్‌, వింటర్‌ 2021 ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న మోడళ్లు పలు రకాల డిజైనర్‌ దుస్తులను ప్రదర్శించారు. కొవిడ్‌ ఎఫెక్టుతో ర్యాంప్‌ వాక్‌ సమయంలో పల్చని మాస్కులు ధరించారు.
ఏపీ ఆరోగ్య ఆసరా లబ్ధిదారులకు ప్రోత్సాహకం పెంపు!
ఏపీ ప్రభుత్వం ఆరోగ్య ఆసరా పథకంలో లబ్ధిదారులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని సాధారణ కాన్పుకు రూ.3వేలు నుంచిరూ.5 వేలుకు, సిజేరియన్‌కు రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు చొప్పున పెంచి ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.
విద్య, వైద్య రంగాల్లో క్రైస్తవ మిషనరీల కీలకపాత్ర : మంత్రి కేటీఆర్
దేశాభివృద్ధిలో..ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో క్రైస్తవ మిషనరీలు కీలకపాత్ర పోషించాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ మిషనరీ ఆస్పత్రులు సమర్థ పాత్ర పోషిస్తున్నాయన్నారు.
వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల అంకురార్పణ!
ముక్కోటి దేవతలు, భక్తకోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నిర్వహించారు. దీనికి సంబంధించిన వైదిక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు.
తీసేశారు.. మళ్ళీ పెట్టేశారు.. గూగుల్ ప్లే స్టోర్ లో పేటీఎం యాప్!
శుక్రవారం ఉదయం గూగుల్ ప్లే స్టోర్ లో పేటీఎం యాప్ ను తీసేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, సాయంత్రం పేటీఎం తమ యాప్ అందుబాటులోకి వచ్చిందని ప్రకటించింది.