బ్రహ్మోత్సవాలలో శనివారం కార్యక్రమాలు..

బ్రహ్మోత్సవాలలో భాగంగా.. శనివారం 19 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణం..రాత్రి 9 గంటలకు స్వామి వారి పెద్ద శేష వాహన సేవ నిర్వహిస్తారు. 2020- Saturday
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆదివారం 20 వతేదీ కార్యక్రమాలు..
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఆదివారం 20 సెప్టెంబర్ ఉదయం 9 గంటలకు చిన శేష వాహన సేవ.. రాత్రి 9 గంటలకు హంస వాహన సేవ శ్రీవారికి నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 21 సెప్టెంబర్ కార్యక్రమాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 21 సెప్టెంబర్ ఉదయం 9 గంటలకు సింహవాహన సేవ.. రాత్రి 9 గంటలకు ముత్యాల పల్లకి వాహన సేవ ఏడుకొండల వారికి నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 22 సెప్టెంబర్ కార్యక్రమాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం 22 సెప్టెంబర్ ఉదయం 9 గంటలకు కల్పవృక్ష వాహన సేవ.. రాత్రి 9 గంటలకు సర్వ భూపాల వాహన సేవ వడ్డీకాసుల వాడికి నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో బుధవారం 23 సెప్టెంబర్ కార్యక్రమాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం 23 సెప్టెంబర్ ఉదయం 9 గంటలకు మోహినీ అవతారంలో శ్రీవారు దర్శనమిస్తారు. రాత్రి 7:30 గంటలకు గోవిందునికి గరుడవాహన సేవ నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 24 సెప్టెంబర్ కార్యక్రమాలు!
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం 24 సెప్టెంబర్ ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవ.. సాయంత్రం 5 గంటలకు స్వర్ణ రధోత్సవం.. రాత్రి 9 గంటలకు గజవాహన సేవ వేయినామాల వాడికి నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో25 సెప్టెంబర్ కార్యక్రమాలు!
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం 25 సెప్టెంబర్ ఉదయం 9 గంటలకు సూర్య ప్రభ వాహన సేవ.. రాత్రి 9 గంటలకు చంద్ర ప్రభ వాహన సేవ వేంకటేశునికి నిర్వహిస్తారు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 26 సెప్టెంబర్ కార్యక్రమాలు!
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం 26 సెప్టెంబర్ ఉదయం 6 గంటలకు రధోత్సవం..రాత్రి 9 గంటలకు అశ్వ వాహనసేవ నిర్వహిస్తారు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 27 సెప్టెంబర్ కార్యక్రమాలు!
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం 27 సెప్టెంబర్ ఉదయం 6 గంటలకు శ్రీవారికి చక్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక్కడితో బ్రహ్మోత్సవాలు పూర్తీ అయినట్టే ..రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణం తో బ్రహ్మోత్సవ వేడుకకు ముగింపు పలుకుతారు.
సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఈరోజే అంకురార్పణ
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం అంకురార్పణ, విష్వక్సేన ఆరాధనతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఈసారి వేడుకలు శ్రీవారికి ఏకాంతం గానే జరుపనున్నారు.