మంటకు దగ్గరగా ఉండి ఉల్లిగడ్డలను కట్ చేయడం వల్ల కూడా కళ్లలో నుంచి నీరు రావు. అందుకే వంట స్టవ్ దగ్గర ఉండి ఉల్లిగడ్డలను కట్ చేయాలి. లేదా ఉల్లిపాయలను కోసే చోట ఒక కొవ్వొత్తిని పెట్టుకున్నా ఫర్వాలేదు.
కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిగడ్డలను కోయడమెలా
ఉల్లిగడ్డలను కోసేముందు పై పొర తీసి నీటిలో వేస్తే కళ్లు మండటం తగ్గుతుంది. ఈ చిట్కాను చాలామంది వాడుతుంటారు. అయితే పైపొర తీసేసిన తర్వాత ఉల్లిగడ్డను మధ్యలోకి రెండు భాగాలుగా కోసి నీటిలో వేస్తే ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది.
కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిగడ్డలను కోయడమెలా
ఉల్లిగడ్డలను పదును లేని చాకుతో కట్ చేస్తే వాటి పొరలలో నుంచి ఎక్కువ మోతాదులో సల్ఫర్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. అదే పలుచగా, పదునుగా ఉండే కత్తిని వాడినప్పుడు ఉల్లి పొర తొందరగా కట్ అయి తక్కువ మోతాదులో రసాయనాలు వెలువడతాయి. కళ్లు కూడా అంతగా మండవు.