200 రోజుల వ్యాలిడిటీ.. ఈ జియో రీచార్జ్‌తో హాట్‌స్టార్, జెమిని ప్రో ఉచితంగా.!
200 రోజుల వ్యాలిడిటీ:
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు ఏకంగా 200 రోజుల పాటు రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండవచ్చు.
రోజువారీ హై-స్పీడ్ డేటా:
ఈ రీఛార్జ్‌లో రోజూ 2.5GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది, దీని ద్వారా మొత్తం వ్యాలిడిటీకి 500GB డేటా అందుతుంది.
అన్‌లిమిటెడ్ 5G డేటా యాక్సెస్:
అర్హత ఉన్న వినియోగదారులకు ఎలాంటి అదనపు రుసుము లేకుండా అన్‌లిమిటెడ్ 5G డేటా సౌకర్యం లభిస్తుంది.
అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు:
ఈ ప్లాన్‌లో వినియోగదారుల కోసం అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌ల కోటా అందించబడుతుంది.
ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్:
వినోదం కోసం జియోహాట్‌స్టార్ మొబైల్, హాలీవుడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
18 నెలల ఉచిత గూగుల్ జెమిని ప్రో:
ఈ ప్లాన్‌తో పాటు గూగుల్ జెమిని ప్రో ఏఐ సేవలు 18 నెలల పాటు ఉచితంగా పొందవచ్చు.
5,000GB క్లౌడ్ స్టోరేజ్ ప్రయోజనం:
గూగుల్ జెమిని ప్రో ఆఫర్‌తో పాటు అదనంగా 5,000GB క్లౌడ్ స్టోరేజ్, ప్రత్యేక ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్:
వినియోగదారుల డేటా భద్రత కోసం 50GB జియోఏఐక్లౌడ్ స్టోరేజ్ సదుపాయం కూడా ఈ ప్లాన్‌లో లభిస్తుంది.
12 నెలల ఉచిత కాన్వా ప్రో లైట్:
డిజైనింగ్ కోసం 12 నెలల పాటు ఉచితంగా కాన్వా ప్రో లైట్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.