బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుస్తే మీరు షాక్ అవుతారు.
దీపికా తన చర్మ ఆరోగ్యానికి ప్రతిరోజూ ఉదయం బీట్ రూట్ జ్యూస్ రెసీపీ తాగుతుందట. ఆ రెసీపీ ఎలా తయారు చేస్తారో ప్రముఖ డైటీషిషయన్ శ్వేతా షా వీడియో షేర్ చేశారు.
కావాల్సిన పదార్ధాలు పుదీనా, కొత్తిమీర, వేపాకులు, కరివేపాకు, బీట్ రూట్
ముందుగా పుదీనా, కొత్తిమీర, బీట్ రూట్ బాగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
బ్లెండర్ తీసుకుని అందులో పుదీనా, కొత్తిమీర, వేపాకులు, కరివేపాకు, బీట్ రూట్ వేయాలి.
ఇప్పుడు అందులో నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసులోకి జ్యూస్ తీసుకోవాలి.
దీపికా ప్రతిరోజూ ఈ జ్యూస్ ను తన డైట్లో చేర్చుకుంటుందట.ఈ మధ్యే దీపిక పదుకునే పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
బీట్రూట్ జ్యూస్ తోపాటు సమతుల్య ఆహారం, సరైన నిద్ర, వ్యాయామం చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ బీట్రూట్ జ్యూస్ రెసీపీ మీరూ ట్రై చేసే ముందు ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం మర్చిపోవద్దు.