కాఫీలో ఉండే కెఫీన్, యాసిడ్స్ ఖాళీ కడుపుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీనివల్ల కడుపులో మంట, గ్యాస్, తీవ్రమైన ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది.
హార్మోన్ల అసమతుల్యత
ఉదయాన్నే మన శరీరంలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుంది. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల ఈ హార్మోన్ ఉత్పత్తి పెరిగి, అనవసరమైన ఆందోళన, ఒత్తిడికి దారితీస్తుంది.
గుండె వేగం పెరగడం
ఖాళీ కడుపుతో కాఫీ తాగినప్పుడు కెఫీన్ రక్తంలో త్వరగా కలుస్తుంది. దీనివల్ల కొందరికి గుండె వేగం పెరగడం, వణుకు లేదా కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
బ్లడ్ షుగర్ పై ప్రభావం
ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు రావచ్చు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది, తద్వారా దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.
సరైన సమయం ఏది?
కాఫీ తాగడానికి ఉత్తమ సమయం.. అల్పాహారం తిన్న గంట తర్వాత. అలాగే నిద్రలేవగానే మొదట ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది.
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు
కాఫీకి బదులుగా ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు, గ్రీన్ టీ, కొబ్బరి నీళ్లు లేదా హెర్బల్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
పరిమితి ముఖ్యం
అతిగా కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం. రోజుకు 1 లేదా 2 కప్పులకు మించి కాఫీ తాగకుండా చూసుకోవడం మంచిది.